RRB Alert: రైల్వే జాబ్ పేరుతో మోసాలు... జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Recruitment Board Warning | నిరుద్యోగుల్లో రైల్వే ఉద్యోగానికి డిమాండ్ చాలా ఎక్కువ కావడంతో మోసాలు చేస్తుంటాయి. లక్షన్నర పోస్టుల్ని రైల్వే భర్తీ చేస్తుండటంతో ఈ సమయంలోనే మోసాలు ఎక్కువ.

news18-telugu
Updated: May 11, 2019, 9:49 PM IST
RRB Alert: రైల్వే జాబ్ పేరుతో మోసాలు... జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ
RRB Alert: రైల్వే జాబ్ పేరుతో మోసాలు... జాగ్రత్త అంటున్న ఆర్ఆర్‌బీ
news18-telugu
Updated: May 11, 2019, 9:49 PM IST
రైల్వే ఉద్యోగం... నిరుద్యోగులకు కల. రైల్వే నోటిఫికేషన్ విడుదలైందంటే పండగే. రైల్వే జాబ్ సంపాదించాలని కష్టపడి చదువుతుంటారు. ఇటీవల రైల్వే కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మూడు నెలల్లో సుమారు లక్షన్నర ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడం విశేషం. అయితే నిరుద్యోగుల కలల్ని క్యాష్ చేసుకునేందుకు ముఠాలు రంగంలోకి దిగుతుంటాయి. నిరుద్యోగుల్లో రైల్వే ఉద్యోగానికి డిమాండ్ చాలా ఎక్కువ కావడంతో మోసాలు చేస్తుంటాయి. లక్షన్నర పోస్టుల్ని రైల్వే భర్తీ చేస్తుండటంతో ఈ సమయంలోనే మోసాలు ఎక్కువ. అందుకే మోసపోవద్దంటూ ఆర్ఆర్‌బీ అభ్యర్థుల్ని అప్రమత్తం చేస్తోంది. జాగ్రత్తగా ఉండాలంటో ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ ఓ ఆడియోను రిలీజ్ చేసింది.

Read this: Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ హెచ్చరికలు ఇవే...



రైల్వే ఉద్యోగాల నియామకంలో దళారుల ప్రమేయం ఉండదు.
రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్ మాటలు నమ్మొద్దు.


జాబ్ రాకెట్ నిర్వహించేవారి వలలో పడి మోసపోవద్దు.
రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా అంటే స్థానికంగా ఉండే ఆర్ఆర్‌బీకి సమాచారం ఇవ్వాలి.
Loading...
మోసగాళ్లపై ఆర్ఆర్‌బీకి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
ఫిర్యాదు చేసినవారి పేర్లను గోప్యంగా ఉంచుతుంది ఆర్ఆర్‌బీ.

Read this: After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

RRB Warning, RRB Jobs, RRB Notifications, RRB Level 1 Jobs, RRB NTPC Jobs, RRB latest jobs, Railway jobs, రైల్వే ఉద్యోగాలు, ఆర్ఆర్‌బీ హెచ్చరిక, ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్, రైల్వే జాబ్స్, ఆర్ఆర్‌బీ లెవెల్ 1 జాబ్స్, ఆర్ఆర్‌బీ ఎన్‌టీసీపీ జాబ్స్
image: RRB


భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నియామక ప్రక్రియ నిర్వహిస్తుంది. పలు దశల్లో కంప్యూటరైజ్డ్ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. ఆర్ఆర్‌బీ తరఫున ఏజెంట్లు ఎవరూ ఉండరు. ఆర్ఆర్‌బీ ఎలాంటి కోచింగ్ సెంటర్లు నిర్వహించదు. రైల్వే నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్, వార్తాపత్రికలు, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఫాలో కావాలి. ఎవరి మాటలూ నమ్మొద్దు. రికమండేషన్లతో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని అస్సలు నమ్మొద్దు. ఒకవేళ మీరు అడ్డదారుల్లో ఉద్యోగం సంపాదించాలని చూస్తే పరీక్షలకు అనర్హులుగా ప్రకటించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఆర్ఆర్‌బీ. అందుకే ఎవరైనా రేల్వే ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్తే ఆర్ఆర్‌బీకి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

RRB: రైల్వే ఉద్యోగానికి అప్లై చేశారా? ఈ పుస్తకాలు చదవండి

PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...

WhatsApp: ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... ఫోన్ మార్చాల్సిందే
First published: May 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626