RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే

RRB Paramedical Recruitment 2019 | ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ మొదటి వారంలో పరీక్షలు జరగాలి. కానీ... పలు కారణాల వల్ల మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జూలై మూడోవారంలో నిర్వహించనుంది.

news18-telugu
Updated: July 4, 2019, 5:59 PM IST
RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే
RRB 2019: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... హాల్‌టికెట్స్, ఎగ్జామ్ డేట్స్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 4, 2019, 5:59 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB పారామెడికల్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకున్నారా? పరీక్ష తేదీలను ఖరారు చేసింది ఆర్ఆర్‌బీ. జూలై 19, 20, 21 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్. అన్ని రీజనల్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్లల్లో సమాచారాన్ని అప్‌డేట్ చేసింది. జూలై 9 నుంచి ఎగ్జామ్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. అదే రోజు మాక్ ఎగ్జామ్ లింక్ యాక్టివేట్ చేయనుంది ఆర్ఆర్‌బీ. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు ఫ్రీ ట్రావెల్ పాస్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్స్ మాత్రం జూలై 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. అదే రోజున హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ అవుతుంది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ మొదటి వారంలో పరీక్షలు జరగాలి. కానీ... పలు కారణాల వల్ల మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జూలై మూడోవారంలో నిర్వహించనుంది.

Read this: RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

మొత్తం 1937 ఉద్యోగాల భర్తీ కోసం పారామెడికల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టింది ఆర్ఆర్‌బీ. ఇందులో 1,109 స్టాఫ్ నర్స్, 289 హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, 277 ఫార్మాసిస్ట్ పోస్టులు కాగా మిగతావి 13 విభాగాల పోస్టులున్నాయి. 2019 మార్చి 4న నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల్ని స్వీకరించింది. ఇక ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు ఎప్పుడన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల్ని జూలైలోనే నిర్వహించే అవకాశముంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:
Loading...
RRB NTPC 2019: ఎన్‌టీపీసీ పరీక్ష ఎప్పుడు? క్లారిటీ ఇవ్వని ఆర్ఆర్‌బీ

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...