RRB Exam: ఆర్ఆర్‌బీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

RRB Paramedical CBT admit card | ఫార్మాసిస్ట్ పోస్టులు 277, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ పోస్టులు 289, స్టాఫ్ నర్స్ పోస్టులు 1,109 ఉండగా, మిగతావి 13 విభాగాల పోస్టులు. జూన్ మొదటి వారంలోనే జరగాల్సిన ఈ పరీక్ష జూలై మూడోవారానికి వాయిదా పడింది.

news18-telugu
Updated: July 15, 2019, 10:35 AM IST
RRB Exam: ఆర్ఆర్‌బీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా
RRB Exam: ఆర్ఆర్‌బీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల... డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 15, 2019, 10:35 AM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహిస్తున్న పారామెడికల్ ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తు చేశారా? మీకు గుడ్ న్యూస్. జూలై 19 నుంచి 21 వరకు జరగబోయే పారామెడికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT అడ్మిట్ కార్డులను ఆర్ఆర్‌బీ విడుదల చేసింది. జూలై 15 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కొద్ది రోజుల క్రితమే సమాచారం ఇచ్చింది ఆర్ఆర్‌బీ. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 1937 పోస్టుల భర్తీ కోసం ఆర్ఆర్‌బీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో ఫార్మాసిస్ట్ పోస్టులు 277, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ పోస్టులు 289, స్టాఫ్ నర్స్ పోస్టులు 1,109 ఉండగా, మిగతావి 13 విభాగాల పోస్టులు. జూన్ మొదటి వారంలోనే జరగాల్సిన ఈ పరీక్ష జూలై మూడోవారానికి వాయిదా పడింది.

RRB Paramedical CBT admit card: అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా...


మీరు సికింద్రాబాద్ ఆర్ఆర్‌బీలో పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టైతే http://rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

CEN No.02/2019 for Paramedical Categories లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. టాప్‌లో పారామెడికల్ హాల్ టికెట్‌కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయండి. లేదా హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ చేయండి.


స్క్రీన్‌పైన RRB Paramedical CBT admit card 2019 కనిపిస్తుంది.
Loading...
పారామెడికల్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
అడ్మిట్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, కేటగిరీ, ఎగ్జామ్, సమయం, సెంటర్ అడ్రస్ లాంటి వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయో లేదో చూసుకోండి.
వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే 022-62507745 నెంబర్‌కు కాల్ చేసి సరిదిద్దుకోవచ్చు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...