news18-telugu
Updated: May 19, 2019, 1:04 PM IST
RRB Admit Card: ఆర్ఆర్బీ పరీక్షల హాల్ టికెట్ల విడుదల... డౌన్లోడ్ చేసుకోండి ఇలా
ఆర్ఆర్బీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. పలు పరీక్షలకు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్(JE), డిపో మెటిరీయల్ సూపరింటెండెంట్(DMS), కెమికల్ అండ్ మెటల్లర్జికల్ అసిస్టెంట్(CMA) పరీక్షలు మే 22 నుంచి జరగనున్నాయి. మే 18 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని గతంలోనే ప్రకటించింది ఆర్ఆర్బీ. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కోసం లింక్ యాక్టివేట్ చేసింది. జేఈ, డీఎంఎస్, సీఎంఏ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి అడ్మిట్ కార్డ్ సమాచారాన్ని ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా అందించింది ఆర్ఆర్బీ. మీరు ఈ ఆర్ఆర్బీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Read this:
RRB NTPC: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...ముందుగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో RRB Admit Card 2019 ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
RRB 2019 Junior Engineer, DMS, CMA పరీక్షల అడ్మిట్ కార్డ్‌కు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ అయ్యాక అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డ్‌తో పాటు ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
జూనియర్ ఇంజనీర్(JE), డిపో మెటిరీయల్ సూపరింటెండెంట్(DMS), కెమికల్ అండ్ మెటల్లర్జికల్ అసిస్టెంట్(CMA) పోస్టుల భర్తీ కోసం 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్ఆర్బీ. మొత్తం 13487 పోస్టులున్నాయి. మే 22 నుంచి మొదటి దశ కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ నిర్వహిస్తోంది.
OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్
ఇవి కూడా చదవండి:
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేస్తున్నారా? ఆధార్ తప్పనిసరి అంటున్న ఆర్ఆర్బీ
RRB: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? జాగ్రత్త అంటున్న ఆర్ఆర్బీ
Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది
Published by:
Santhosh Kumar S
First published:
May 19, 2019, 1:04 PM IST