RAILWAY RECRUITMENT BOARD RRB NTPC 2019 RECRUITMENT NOTIFICATION APPLY BEFORE MARCH 31 FOR 35277 NON TECHNICAL POPULAR CATEGORIES NTPC POSTS IN INDIAN RAILWAYS SS
RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ
RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ (image: Getty Images)
RRB NTPC 2019 Recruitment Notification | కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ.
భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించడం మీ కలా? ఈ ఏడాది రైల్వేలో భారీగా ఖాళీల భర్తీ జరుగుతోంది. ఒక్క నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)లోనే 35,277 పోస్టుల్ని భర్తీ చేయనుంది రైల్వే. మార్చి మొదటివారంలోనే ఎన్టీపీసీ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ జోన్లో 3234 ఖాళీలున్నాయి. ఆర్ఆర్బీకి చెందిన అన్ని రీజియన్ల వెబ్సైట్లలో NTPC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కమర్షియల్ అప్రెంటీస్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ. సికింద్రాబాద్ రీజియన్లో ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
RRB NTPC Notification: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01-03-2019
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగింపు: 31-03-2019 రాత్రి 11.59 నిమిషాల వరకు
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ
1.ఆన్లైన్ (Net Banking/ Credit Card/ Debit Card/UPI)- 05.04.2019
2. ఎస్బీఐ చాలాన్: 05.04.2019 మధ్యాహ్నం 3 గంటల వరకు.
3. పోస్ట్ ఆఫీస్ చాలాన్: 05.04.2019 మధ్యాహ్నం 3 గంటల వరకు.
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 12.04.2019 అర్థరాత్రి 23.59 గంటల వరకు.
మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న ఆర్ఆర్బీ రీజియన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
RRB వెబ్సైట్ హోమ్ పేజీలోనే NTPC నోటిఫికేషన్ లింక్ ఉంటుంది.
NTPC నోటిఫికేషన్ లింక్ క్లిక్ చేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ లింక్స్ ఉంటాయి.
ముందుగా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పూర్తిగా చదవాలి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మీకు తగిన అర్హతలు ఉంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులకు తగిన అర్హతలు ఉంటేనే అప్లై చేయాలి.
అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బీ రీజియన్ మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
మీరు ఒకటి కన్నా ఎక్కువ ఆర్ఆర్బీలు ఎంచుకుంటే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది.
దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోవాలి.
Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.