RRB Update: రైల్వే జాబ్‌కు అప్లై చేసిన అభ్యర్థులకు షాక్... పరీక్ష వాయిదా
RRB NTPC CBT 1 Update | ఆర్ఆర్బీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఇప్పుడు ఆర్ఆర్బీ స్పందించింది.
news18-telugu
Updated: October 15, 2019, 1:19 PM IST

RRB Update: రైల్వే జాబ్‌కు అప్లైచేసిన అభ్యర్థులకు షాక్... పరీక్ష వాయిదా (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: October 15, 2019, 1:19 PM IST
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB ఎన్టీపీసీ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు షాకింగ్ న్యూస్. పరీక్ష వాయిదా పడ్డట్టు ఆర్ఆర్బీ అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 జరగాల్సి ఉంది. కానీ వారాలు గడుస్తున్నా ఎన్టీపీసీ సీబీటీ 1 గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అసలు పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్న అనుమానాలు, సందేహాలు అభ్యర్థుల నుంచి వచ్చాయి. ఇతర నోటిఫికేషన్ల పరీక్షల్ని ఆర్ఆర్బీ నిర్వహిస్తోంది కానీ... ఎన్టీపీసీ నోటిఫికేషన్ పరీక్షల గురించి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఆర్ఆర్బీ పరీక్షల్ని నిర్వహించే బాధ్యతను ఎగ్జామినేషన్ కండక్టింగ్ అథారిటీకి అప్పగిస్తారన్న వార్తలొచ్చాయి. అందుకే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్ష నిర్వహణలో జాప్యం జరుగుతుందనుకున్నారు. ఇవన్నీ బయట జరుగుతున్న ప్రచారమే తప్ప... ఆర్ఆర్బీ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం ఇన్నాళ్లూ బయటకు రాలేదు. ఇప్పుడు ఆర్ఆర్బీ స్పందించింది. "2019 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రివైజ్డ్ షెడ్యూల్‌ను అన్ని ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లల్లో తర్వాత అప్లోడ్ చేస్తాం. అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్స్‌ను ఫాలో కావాలి" అని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్-RRB అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఈ నోటీసు ఆర్ఆర్బీ వెబ్సైట్లల్లో కనిపించింది. నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read this: RRB NTPC: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...
భారతీయ రైల్వేలో 35,000 పైగా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల భర్తీకి 2019 ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్బీ. ఈ పోస్టులకు ఏకంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారంతా ఏప్రిల్ నుంచి పరీక్ష తేదీల కోసం, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. అయితే ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ పరీక్ష నిర్వహణలో బిజీగా ఉన్నందున ఎన్టీపీసీ పరీక్షలు వాయిదా పడ్డట్టు రైల్వే అధికారుల సమాచారం.Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు
ఇవి కూడా చదవండి:
DRDO Jobs: డీఆర్డీఓలో 371 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హతRailway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు... అర్హతలివే
Smartphone: రూ.15,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇవే బెస్ట్ మోడల్స్

Govt Jobs: ఇంటర్ పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... అప్లికేషన్ స్టెప్స్ ఇవే
SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 ట్రైనీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్డీఓలో 1817 ఉద్యోగాలు
ISRO Jobs: ఇస్రోలో 220 ఉద్యోగాలు... రేపటి నుంచి ఇంటర్వ్యూలు
Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Bank Jobs: మొత్తం 350 బ్యాంక్ ఉద్యోగాలు... అప్లై చేయండిలా