RRB Exam Fee Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఫీజు రీఫండ్ చేస్తున్న ఆర్ఆర్‌బీ... ఇలా అప్లై చేయండి

RRB Exam Fee Refund: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ఫీజు రీఫండ్ చేస్తున్న ఆర్ఆర్‌బీ... ఇలా అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

RRB Exam Fee Refund | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఓ పరీక్ష ఫీజును రీఫండ్ చేస్తోంది. రీఫండ్ ఎలా పొందాలో తెలుసుకోండి.

  • Share this:
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్​ఆర్​బీ) 2019లో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష కూడా పూర్తయింది. అయితే పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఇప్పుడు ఫీజు రీఫండ్ లింక్​ను యాక్టివేట్ చేసింది. అధికారిక ప్రకటన ప్రకారం, ఫీజు రీఫండ్ లింక్ ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆగస్టు 31 వరకు యాక్టివేట్​లో ఉంటుంది. అభ్యర్థులు ఈ లింక్​ ద్వారా ఫీజు రీఫండ్​కు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వారి బ్యాంక్​ అకౌంట్​లో రీఫండ్​ అమౌంట్​ జమ అవుతుంది. ఆర్‌ఆర్‌బీ నిర్వహించే పరీక్షల అప్లికేషన్ ఫీజులను.. పరీక్ష ముగిసిన తరువాత తిరిగి అభ్యర్థులకు చెల్లిస్తారనే విషయం తెలిసిందే.

ఆర్​ఆర్​బీ మినిస్టీరియల్​, ఐసోలేటెడ్​ కేటగిరీలో 1665 పోస్టుల భర్తీకి 2020 డిసెంబర్​లో కంప్యూటర్​ బేస్డ్ టెస్ట్​ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 46,480 మంది హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల్లో 31,619 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు రీఫండ్ కోసం తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించారు. ఇందులో 29,683 మంది అభ్యర్థుల ఫీజును ఆర్​ఆర్​బీ ఇప్పటికే రీఫండ్ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే, మిగిలిన 1,936 మంది అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఇవ్వనందున రీఫండ్ చేయలేదు. ఆయా అభ్యర్థులు మరోసారి రీఫండ్​ రిక్వెస్ట్ చేసుకునేందుకు ఆర్​ఆర్​బీ అవకాశం కల్పించింది.

RRB NTPC Results: ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఎగ్జామ్ రాశారా? మీ మార్కులు ఇలా తెలుసుకోండి

Constable Jobs: మొత్తం 25,271 కానిస్టేబుల్ జాబ్స్... ఏం చదవాలంటే

మిగిలిన 16,797 మంది అభ్యర్థులు సరైన బ్యాంక్ ఖాతా వివరాలను అందించడానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. రీఫండ్​ క్లెయిమ్​ చేసుకునేందుకు అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం వారి రోల్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి. ఈ ప్రక్రియ ఆగస్టు 31లోపు పూర్తి చేయాలి.

బ్యాంక్ ఖాతా వివరాలు ఇలా అప్‌డేట్ చేసుకోండి


అభ్యర్థులు ముందుగా ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత, మీ బ్యాంక్ ఖాతా వివరాలను సరిదిద్దుకునేందుకు CEN-03/2019 (మినిస్టీరియల్​ అండ్ ఐసోలేటెడ్​) లింక్‌పై క్లిక్ చేయాలి. హోమ్‌పేజీలో ఈ లింక్​ను చూడవచ్చు. ఆ తర్వాత మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యురిటీ కోడ్‌ని ఎంటర్ చేసి ఎడిట్​​ పేజీలోకి లాగిన్ అవ్వండి. తరువాత, దరఖాస్తు ఫీజు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయండి.

Army Jobs 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

ఒక్కసారి సబ్​మిట్​ చేసిన తర్వాత మళ్లీ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి సబ్​మిట్​ చేసే ముందు బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ వివరాలను నిర్ధారించుకోవాలని ఆర్​ఆర్​బీ సూచించింది. కాగా, బ్యాంక్​ ఖాతా వివరాలు తప్పుగా ఇవ్వడం వల్ల రీఫండ్​ పొందలేకపోయిన అభ్యర్థులకు ఇప్పటికే ఎస్​ఎమ్​ఎస్​,ఈ–మెయిల్ ద్వారా ఆర్​ఆర్​బీ వారికి సమాచారం అందించింది.
Published by:Santhosh Kumar S
First published: