RAILWAY RECRUITMENT BOARD RRB ISSUED DETAILED NOTIFICATION AND BEGINS REGISTRATION PROCESS FOR 103769 LEVEL 1 OR GROUP D POSTS 9328 VACANCIES IN SECUNDERABAD ZONE KNOW HOW TO APPLY SS
RRB Level 1 Notification: మొత్తం 1,03,769... సికింద్రాబాద్ జోన్లో 9,328 పోస్టులు, ఇలా అప్లై చేయండి
RRB Level 1 Notification: రైల్వేలో 1,03,769 పోస్టులకు మొదలైన రిజిస్ట్రేషన్... ఇలా అప్లై చేయండి
RRB Level 1 Notification | ఈ పోస్టుల్ని దేశంలోని అన్ని జోన్లల్లో భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ. లెవెల్-1 లేదా గ్రూప్-డీలో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ IV (ట్రాక్‌మ్యాన్), గేట్‌మ్యాన్, పాయింట్స్‌మ్యాన్, హెల్పర్, పోర్టర్ లాంటి పోస్టులు ఉంటాయి.
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. ఏకంగా 1,03,769 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. మార్చి 1 నుంచి ఆర్ఆర్బీ కొలువుల పండుగ కొనసాగుతోంది. ఇప్పటికే వేర్వేరు కేటగిరీల్లో పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన ఆర్ఆర్బీ... మార్చి 12న లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాలకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆర్ఆర్బీకి చెందిన అన్ని జోన్ల వెబ్సైట్లల్లో దరఖాస్తు చేయొచ్చు. సికింద్రాబాద్ జోన్లో 9,328 పోస్టులున్నాయి. సికింద్రాబాద్ జోన్లో ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సికింద్రాబాద్ జోన్లో ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
RRB Level 1 నోటిఫికేషన్... గుర్తుంచుకోవాల్సిన అంశాలు
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2019 మార్చి 12
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 12
అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: 2019 ఏప్రిల్ 26 రాత్రి 11.59 వరకు
పేమెంట్‌కు వివరాలు
ఆన్లైన్: 2019 ఏప్రిల్ 23 రాత్రి 11.59 వరకు
ఎస్బీఐ చాలాన్: 2019 ఏప్రిల్ 18 మధ్యాహ్నం ఒంటి గంట వరకు
పోస్ట్ ఆఫీస్ చాలాన్: 2019 ఏప్రిల్ 18 మధ్యాహ్నం ఒంటి గంట వరకు
1,03,769 లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు. ఈ పోస్టుల్ని దేశంలోని అన్ని జోన్లల్లో భర్తీ చేయనుంది ఆర్ఆర్బీ. లెవెల్-1 లేదా గ్రూప్-డీలో ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ IV (ట్రాక్‌మ్యాన్), గేట్‌మ్యాన్, పాయింట్స్‌మ్యాన్, హెల్పర్, పోర్టర్ లాంటి పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. అయితే వేర్వేరు పోస్టుల్ని బట్టి అర్హత మారుతుంది. అభ్యర్థుల్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రూప్ డీ పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు నెలకు రూ.18,000 వేతనం లభిస్తుంది. ఒకరు ఏదైనా ఒక RRB/RRC ఎంచుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో పరీక్షలు ఉంటాయి. జోన్ల వారీగా ఖాళీల వివరాలను ఈ చార్ట్‌లో చూడొచ్చు.
కొద్ది రోజుల క్రితమే రైల్వే 62,000 లెవెల్-1 (గ్రూప్-డీ) ఉద్యోగాల భర్తీలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు మరో 1,03,769 ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. మార్చిలోనే భారీగా కొలువుల జాతరకు తెరతీసింది ఆర్ఆర్బీ. ఇప్పటికే నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC), పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.