Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ

Railway Jobs | దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత దరఖాస్తును ఆమోదించారా? రిజెక్ట్ చేశారా? అన్న విషయాన్ని అభ్యర్థులకు ఆగస్ట్ 31 లోగా ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తామని ఆర్ఆర్‌బీ వెల్లడించింది.

news18-telugu
Updated: August 31, 2019, 3:13 PM IST
Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ
Railway Jobs: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? ముఖ్యమైన నోటీస్ జారీ చేసిన ఆర్ఆర్‌బీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 31, 2019, 3:13 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB జారీ చేసిన లెవెల్ 1 నోటిఫికేషన్‌‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకున్నారా? దరఖాస్తులు తిరస్కరణకు గురైనవారికి మరో అవకాశం ఇచ్చింది ఆర్ఆర్‌బీ. చాలామంది దరఖాస్తులు ఫోటోలు, సంతకం సరిగ్గా లేక రిజెక్ట్ అయినట్టు తేలింది. దరఖాస్తుల్ని తాము సరిగ్గానే అప్‌లోడ్ చేశామన్న వాదన అభ్యర్థులది. అలాంటివారంతా ఫిర్యాదు చేయొచ్చని ఆర్ఆర్‌బీ గతంలోనే వెల్లడించింది. ఆ ఫిర్యాదుల్ని స్వీకరించి దరఖాస్తుల్ని మరోసారి పరిశీలిస్తామని కూడా తెలిపింది. ఆగస్ట్ 17న ఫిర్యాదుల లింక్ యాక్టివేట్ చేసింది. ఆగస్ట్ 23 రాత్రి 11:59 వరకు ఫిర్యాదుల్ని స్వీకరించింది. ఆ ఫిర్యాదుల్ని ఇంకా పరిశీలిస్తోంది ఆర్ఆర్‌బీ. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత దరఖాస్తును ఆమోదించారా? రిజెక్ట్ చేశారా? అన్న విషయాన్ని అభ్యర్థులకు ఆగస్ట్ 31 లోగా ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం ఇస్తామని ఆర్ఆర్‌బీ వెల్లడించింది.

ఆగస్ట్ 31 వచ్చినా చాలామంది అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్‌లో ఎలాంటి సమాచారం రాలేదు. దరఖాస్తుల పరిశీలన ఇంకా కొనసాగుతుండటంతో ఫిర్యాదులపై తుది నిర్ణయం తీసుకుంటూ సమచారాన్ని ఇచ్చే గడువును ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 6వ తేదీకి పొడిగించింది ఆర్ఆర్‌బీ. లెవెల్ 1 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటివరకు ఆర్ఆర్‌బీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 6వ తేదీ లోపు ఆర్ఆర్‌బీ నుంచి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్ కోసం తరచూ ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ చూస్తూ ఉండాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2019 ఫిబ్రవరి 23న లెవెల్ 1 (గ్రూప్ డీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1,03,769 పోస్టుల్ని ప్రకటించింది. త్వరలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించే అవకాశముంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే
Loading...
DEET App: నిరుద్యోగులకు వరంగా డీట్ యాప్... 1,00,000 దాటిన డౌన్‌లోడ్స్

Jobs: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 311 జాబ్స్
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...