హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC Exam: డిసెంబర్ 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... హాల్ టికెట్స్ ఎప్పుడంటే

RRB NTPC Exam: డిసెంబర్ 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... హాల్ టికెట్స్ ఎప్పుడంటే

RRB NTPC Exam: డిసెంబర్ 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... హాల్ టికెట్స్ ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Exam: డిసెంబర్ 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... హాల్ టికెట్స్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC Exam Date | ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అలర్ట్. త్వరలో పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తెలుసుకోండి.

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB ఎన్‌టీపీసీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 28 నుంచి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఆర్ఆర్‌బీ 35,208 నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల భర్తీకి 2019 మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఇప్పటివరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT నిర్వహించలేదు. ఈ పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారంతా ఏడాదిన్నరగా పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జామ్స్‌పై ఇటీవల క్లారిటీ ఇచ్చారు భారతీయ రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్. ఎన్‌టీపీసీ పోస్టులకు 2020 డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు దశలవారీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పాటు లెవెల్ 1 పోస్టులకు, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీస్ పోస్టులకు కూడా పరీక్షలు జరగనున్నాయి. ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీస్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే డీటెయిల్డ్ షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15 నుంచి ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

  RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

  Telangana Army Recruitment Rally: ఆర్మీలో ఉద్యోగం మీ కలా? సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ

  ఇక ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు 2020 డిసెంబర్ 28 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. అభ్యర్థులకు 10 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ విడుదల కానున్నాయి. అంటే డిసెంబర్ 18 నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశముంది. ఈ ఎగ్జామ్స్ 2021 మార్చి చివరి వారం వరకు జరిగే అవకాశం ఉండటంతో అడ్మిట్ కార్డులు కూడా దశలవారీగా విడుదలయ్యే అవకాశముంది. అడ్మిట్ కార్డులతో పాటు ఎగ్జామ్ సిటీ, డేట్ లాంటి వివరాలు కూడా అప్‌డేట్ అవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన డీటెయిల్డ్ షెడ్యూల్ మరో వారం రోజుల్లో ఆర్ఆర్‌బీ విడుదల చేసే ఛాన్స్ ఉంది.

  SBI Jobs 2020: తెలంగాణ, ఏపీలో 1080 బ్యాంక్ జాబ్స్... జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

  SBI PO Recruitment 2020: ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... ఎంపిక విధానం ఇదే

  ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షలు పూర్తైన తర్వాతే లెవెల్ 1 నోటిఫికేషన్‌కు పరీక్షలు జరుగుతాయి. లెవెల్ 1 ఎగ్జామ్స్ 2021 ఏప్రిల్ నుంచి 2021 జూన్ వరకు నిర్వహిస్తామని ఇప్పటికే రైల్వే ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,03,769 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్ఆర్‌బీ. ఈ నోటిఫికేషన్‌కు 1,15,67,248 అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్స్ మాత్రమే ఫాలో కావాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB