Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs | దరఖాస్తులు తిరస్కరణకు గురైనవారంతా ఆగస్ట్ 23 రాత్రి 11:59 లోపు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లింక్ డీయాక్టివేట్ అవుతుంది.

news18-telugu
Updated: August 19, 2019, 3:11 PM IST
Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ
Railway Jobs: మీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఫిర్యాదు చేయమంటున్న ఆర్ఆర్‌బీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 19, 2019, 3:11 PM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB లెవెల్ 1 నోటిఫికేషన్‌‌లో ఉద్యోగాలకు అప్లై చేసిన దరఖాస్తులు భారీగా రిజెక్ట్ అవడం అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది. ఎక్కువగా సంతకం, ఫోటోలు సరిగ్గా లేవన్న కారణంతోనే దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. తాము అన్నీ సరిగ్గానే సబ్మిట్ చేసినా తమ దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయంటూ వేలాదిమంది అభ్యర్థులు ఆర్ఆర్‌బీకి వరుసగా కంప్లైంట్లు చేశారు. ఈ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్న ఆర్ఆర్‌బీ దరఖాస్తుల్ని పరిశీలించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎవరి దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయో వారంతా తమ ఫిర్యాదులు నమోదు చేయాలని కోరుతోంది ఆర్ఆర్‌బీ. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ చేసింది ఆర్ఆర్‌బీ. ఒకవేళ ఆర్ఆర్‌బీ లెవెల్ 1 నోటిఫికేషన్‌‌లో మీ దరఖాస్తు రిజెక్ట్ అయితే ఫిర్యాదు చేయొచ్చు. కంప్లైంట్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

ఆర్ఆర్‌బీ లెవెల్ 1 నోటిఫికేషన్‌‌లో దరఖాస్తులు తిరస్కరణకు గురైనవారంతా ఆగస్ట్ 23 రాత్రి 11:59 లోపు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లింక్ డీయాక్టివేట్ అవుతుంది. ఫిర్యాదుల్ని పరిశీలించిన తర్వాత ఆర్ఆర్‌బీ తన నిర్ణయాన్ని ఆగస్ట్ 31 లోగా తెలుపుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న మొత్తం 1,03,769 లెవెల్ 1 లేదా గ్రూప్ డీ పోస్టుల భర్తీకి ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిర్యాదుల పరిశీలతన తర్వాత ఆర్ఆర్‌బీ లెవెల్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీలు వెలువడతాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో సీబీటీ 1 జరిగే అవకాశముంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

APSBCL Jobs: ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్‌లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
Loading...
Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

IBPS Clerk: బ్యాంక్ ఉద్యోగం మీ కలా? ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలివే
First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...