హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Jobs: ఆర్ఆర్‌బీ ఉద్యోగానికి అప్లై చేశారా? పరీక్ష తేదీలు వచ్చేశాయి

RRB Jobs: ఆర్ఆర్‌బీ ఉద్యోగానికి అప్లై చేశారా? పరీక్ష తేదీలు వచ్చేశాయి

RRB Jobs: ఆర్ఆర్‌బీ ఉద్యోగానికి అప్లై చేశారా? పరీక్ష తేదీలు వచ్చేశాయి
(ప్రతీకాత్మక చిత్రం)

RRB Jobs: ఆర్ఆర్‌బీ ఉద్యోగానికి అప్లై చేశారా? పరీక్ష తేదీలు వచ్చేశాయి (ప్రతీకాత్మక చిత్రం)

RRB Exam Dates 2020 | ఆర్‌ఆర్‌బీ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి గుడ్ న్యూస్. పరీక్ష తేదీలను ప్రకటించింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB.

  పెండింగ్‌లో ఉన్న నియామక పరీక్షల్ని డిసెంబర్ 15 నుంచి నిర్వహిస్తామని ఇప్పటికే ఆర్‌ఆర్‌బీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తి షెడ్యూల్‌ని మాత్రం ఇంతకాలం వెల్లడించలేదు. రైల్వేలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య పరీక్షల్ని నిర్వహిస్తామని తాజాగా ఆర్ఆర్‌బీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తైంది. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు అక్టోబర్ 15 నుంచి 20 వరకు లింక్ అందుబాటులో ఉంచింది ఆర్ఆర్‌బీ. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎగ్జామ్ డేట్స్ ప్రకటించింది. ఈ పోస్టులకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ఫర్మామెన్స్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు తెలుసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ పాస్‌ను కూడా 10 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు విడుదలౌతాయి.

  BDL Recruitment 2020: సంగారెడ్డిలోని బీడీఎల్‌లో 119 జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

  UPSC CDS 2021: డిఫెన్స్‌లో 345 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీల వివరాలివే

  RRB Ministerial and Isolated Category exam date, Railway Recruitment Board exam dates 2020, RRB exam dates 2020, RRB NTPC Exam dates 2020, RRB NTPC admit cards 2020, RRB NTPC Exam schedule, RRB Exam schedule, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, రైల్వే ఉద్యోగాలు 2020, రైల్వే జాబ్స్ 2020, ఆర్ఆర్‌బీ జాబ్స్ 2020
  Source: RRB

  ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ స్టెనోగ్రాఫర్-హిందీ, ఇంగ్లీష్, ట్రాన్స్‌లేటర్, కుక్, వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, టీచర్, లా అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 1663 పోస్టులున్నాయి. గతేడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. పలు కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే కాదు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కొన్ని రోజులు లింక్ కూడా యాక్టీవ్‌లో ఉంచింది. త్వరలో ఎన్‌టీపీసీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశముంది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా 35,000 పైగా పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు కోటీ 25 లక్షలకు మందికి పైగా అభ్యర్థులు అప్లై చేశారు.

  IBPS RRB Recruitment 2020: మొత్తం 8424 బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా...

  Railway Jobs 2020: కొంకణ్ రైల్వేలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

  ఇక రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం http://www.rrbcdg.gov.in/ లేదా http://www.rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఆర్ఆర్‌బీ జాబ్స్, రైల్వే ఉద్యోగాల విషయంలో దళారులను నమ్మి మోసపోకూడదని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB హెచ్చరిస్తోంది. ఆర్ఆర్‌బీ నియామకాలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా జరుగుతాయని, మెరిట్ ద్వారా ఎంపిక చేస్తామని ప్రకటించింది. రైల్వే ఉద్యోగాల పేరుతో మోసపూరిత ప్రకటనలు ఏవైనా మీ దృష్టికి వస్తే 182 నెంబర్‌కు కాల్ చేయాలని ఆర్ఆర్‌బీ కోరుతోంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

  ఉత్తమ కథలు