RRB Jobs: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఎగ్జామ్ డేట్స్ ఇవే...

RRB Jobs: ఆర్ఆర్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల... ఎగ్జామ్ డేట్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)

RRB Exams | పలు కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు జరగలేదు. దీంతో ఆర్ఆర్‌బీ జేఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2 షెడ్యూల్‌ని రివైజ్ చేసి కొత్త తేదీని ప్రకటించింది ఆర్ఆర్‌బీ.

  • Share this:
    ఆర్ఆర్‌బీ జేఈ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. జూనియర్ ఇంజనీర్ 2వ దశ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB. ఆర్ఆర్‌బీ జేఈ మొదటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇప్పటికే పూర్తైన విషయం కూడా తెలిసింది. ఫలితాలు కూడా వచ్చేశాయి. కొద్ది రోజుల క్రితం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2 షెడ్యూల్ ప్రకటించింది ఆర్ఆర్‌బీ. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 మధ్య నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. అయితే పలు కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం పరీక్షల్ని నిర్వహించలేదు. దీంతో ఆర్ఆర్‌బీ జేఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2 షెడ్యూల్‌ని రివైజ్ చేసి కొత్త తేదీని ప్రకటించింది ఆర్ఆర్‌బీ. 2019 సెప్టెంబర్ 9న మాక్ లింక్ యాక్టివేట్ అవుతుంది. సెప్టెంబర్ 19న ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 నిర్వహిస్తున్నట్టు అధికారిక వెబ్‌సైట్‌లో నోటీస్ అప్‌లోడ్ చేసింది. ఆర్ఆర్‌బీ జారీ చేసిన నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    RRB jobs, Railway Jobs,RRB JE CBT 2, rrb je cbt 2 exam date, rrb je exam date, RRB JE CBT 2 admit card, rrb je cbt 2 exam date 2019, RRB JE CBT 2 hall ticket, ఆర్ఆర్‌బీ జాబ్స్, ఆర్ఆర్‌బీ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 అడ్మిట్ కార్డ్, ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 పరీక్ష తేదీ, ఆర్ఆర్‌బీ జేఈ రిక్రూట్‌మెంట్ 2019, ఆర్ఆర్‌బీ జేఈ హాల్ టికెట్
    Source: RRB

    RRB JE CBT-2: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


    ఎగ్జామ్ సిటీ చూసుకోవాల్సిన తేదీ- 2019 సెప్టెంబర్ 9
    ట్రైన్ ట్రావెల్ పాస్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన తేదీ- 2019 సెప్టెంబర్ 9
    మాక్ లింక్ యాక్టివేషన్ చేసే తేదీ- 2019 సెప్టెంబర్ 9
    ఇ-కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన తేదీ- 2019 సెప్టెంబర్ 15
    ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 జరిగే తేదీ- 2019 సెప్టెంబర్ 19

    ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 పరీక్షకు అర్హత సాధించిన వాళ్లంతా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక పైన వెల్లడించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 రెండు గంటలు ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి 1/3 నెగిటీవ్ మార్క్ ఉంటుంది. భారతీయ రైల్వేలో 13487 ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్ఆర్‌బీ. వీటిలో 12,872 జూనియర్ ఇంజనీర్, 227 డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, 387 కెమికల్ అండ్ మెటల్లార్జికల్ అసిస్టెంట్ పోస్టులు. మే 22 నుంచి మే 29 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 జరిగింది. ఈ పరీక్షలు 2 లక్షలకు పైనే అభ్యర్థులు సీబీటీ-2 పరీక్షకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్ 19న సీబీటీ-2 జరగనుంది.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... మొదలైన దరఖాస్తు

    IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 జాబ్స్... పరీక్షల సిలబస్ తెలుసుకోండి

    EWS Quota: 10% ఈడబ్ల్యూఎస్ కోటాకు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి
    First published: