RRB Jobs: రైల్వే జేఈ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేసుకోండి ఇలా

RRB JE 2019 Result 2019 | పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డుల్ని విడుదల చేస్తుంది. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 నిర్వహించనుంది.

news18-telugu
Updated: August 14, 2019, 10:26 AM IST
RRB Jobs: రైల్వే జేఈ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేసుకోండి ఇలా
RRB Jobs: రైల్వే జేఈ ఎగ్జామ్ రాశారా? ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేసుకోండి ఇలా
news18-telugu
Updated: August 14, 2019, 10:26 AM IST
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నిర్వహించిన జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ రాసినవారికి శుభవార్త. ఫలితాలను ఆర్ఆర్‌బీ విడుదల చేసింది. ఆర్ఆర్‌బీ జేఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను rrbonlinereg.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలతో పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 సమాచారాన్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది ఆర్ఆర్‌బీ. ఇక రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు సంబంధించిన వివరాలు చూస్తే ఆగస్ట్ 17న మరిన్ని వివరాలను వెల్లడించనుంది ఆర్ఆర్‌బీ. మాక్ టెస్ట్ లింక్ కూడా అదే రోజు యాక్టివేట్ అవుతుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డుల్ని విడుదల చేస్తుంది. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ 2 నిర్వహించనుంది. జేఈతో పాటు డీఎంఎస్, సీఎంఏ రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సీబీటీ 2 కోసం ఆర్ఆర్‌బీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RRB JE 2019 Result 2019: ఆర్ఆర్‌బీ జేఈ 2019 ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా


ముందుగా rrbonlinereg.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

'Score card of 1st Stage CBT ' లింక్ పైన క్లిక్ చేయండి.
తర్వాత పేజీలో మీరు అప్లై చేసిన ఆర్ఆర్‌బీ రీజియన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.


'Login' పైన క్లిక్ చేస్తే RRB JE CBT 1 Exam 2019 మెరిట్ లిస్ట్ కనిపిస్తుంది.
ఓ కాపీని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

భారతీయ రైల్వేలో మొత్తం 13,000 పైగా జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్ఆర్‌బీ. మే 22 నుంచి మే 29 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1 నిర్వహించింది. జూలై 11న ఆన్సర్ కీ రిలీజ్ చేసిన ఆర్ఆర్‌బీ ఆగస్ట్ 13న ఫలితాలను విడుదల చేసింది.

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...