Home /News /jobs /

RAILWAY RECRUITMENT BOARD NTPC 2021 RESULTS TO BE RELEASED SOON HERE IMPORTANT DETAILS NS GH

NTPC 2021 Results: త్వరలో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ 2021 రిజల్ట్స్.. ఈ ఫార్ములాతో ఫలితాల లెక్కింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NTPC 2021 ఫేజ్ I పరీక్ష ఫలితాలను ప్రకటించడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ సిద్ధమవుతోంది. రిజల్ట్స్ అధికారికంగా విడుదలైన తర్వాత అభ్యర్థులు RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌లను సందర్శించి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నిర్వహించిన నాన్-పాపులర్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మొదటి రౌండ్ పూర్తయింది. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు RRB NTPC 2021 ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. బోర్డు ఒక స్పెషల్ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగించి ఈ ఫలితాలను (NTPC 2021 Results) విడుదల చేయనుంది. బోర్డు సూచించిన ప్రామాణిక సూత్రాన్ని అనుసరించి ఫలితాలను ప్రకటించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వేర్వేరు రోజుల్లో వేర్వేరు షిఫ్టులలో జరిగే పోటీ పరీక్షలకు (Competitive Exams) ఈ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ సహాయంతో ప్రతి షిఫ్ట్‌లో పరీక్ష రాసిన అభ్యర్థుల ఫలితాలకు బోర్డు సమానమైన వెయిటేజీని ఇస్తుంది.

ప్రస్తుతం NTPC 2021 ఫేజ్ I పరీక్ష ఫలితాలను ప్రకటించడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ సిద్ధమవుతోంది. రిజల్ట్స్ అధికారికంగా విడుదలైన తర్వాత అభ్యర్థులు RRB ప్రాంతీయ వెబ్‌సైట్‌లను సందర్శించి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు NTPC CBT-1 పరీక్షను 28 డిసెంబర్ 2020 నుంచి 31 జులై 2021 వరకు నిర్వహించింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎగ్జామ్ జరిగింది. తుది ఫలితాలు సిద్ధం చేయడానికి ఉపయోగించే అసెస్‌మెంట్ వివరాల కోసం RRB అధికారిక వెబ్‌సైట్ http://www.rrbcdg.gov.in/ను సందర్శించవచ్చు.
RRB NTPC Result: ఆ రోజే ఆర్​ఆర్​బీ ఎన్​టీపీసీ ఫలితాలు.. కేటగిరీ వారీగా కటాఫ్​ మార్కులు ఇలా..

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్స్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, భారతీయ రైల్వేలోని వివిధ జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లలో స్టేషన్ మాస్టర్ పోస్టులకు ఈ పరీక్షను ఆర్‌ఆర్‌బీ నిర్వహించింది. మొత్తం 35,208 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరుగుతోంది.
RRB NTPC: ఆర్ఆర్​బీ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త.. వారికి ఫీజు రీఫండ్

CBT-1 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆగస్టు 16న విడుదల చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు ఆగస్టు 23, 2021 వరకు గడువు ఇచ్చింది. దాదాపు 1.9 కోట్ల మంది అభ్యర్థులు RRB NTPC CBT-1 పరీక్షకు హాజరయ్యారు. CBT-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి రౌండ్‌కు ఎంపిక అవుతారు. వీరు CBT-2 పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. CBT-1 ఫలితాల ప్రకటన తర్వాత NTPC CBT-2 పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీలను RRB ప్రకటిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Job notification, Railway jobs, Results, RRB

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు