హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడంటే...

RRB NTPC exam: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడంటే...

RRB NTPC CBT 1 | మొత్తం 35,000 పైగా పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా పరీక్ష తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

RRB NTPC CBT 1 | మొత్తం 35,000 పైగా పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా పరీక్ష తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

RRB NTPC CBT 1 | మొత్తం 35,000 పైగా పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా పరీక్ష తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.

  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB గతేడాది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 35,000 పైగా పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది ఆర్ఆర్‌బీ. ఏకంగా కోటికి పైగా దరఖాస్తులు రావడం విశేషం. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పరీక్షకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియట్లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ నోటీసులు అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. 'మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్' అంటూ ఓ నోటీస్ విపరీతంగా వైరల్ అయింది. కానీ అది ఫేక్ నోటీస్ అని తేలిపోయింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష ఎప్పుడు ఉంటుందా అని అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే మార్చిలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 1 ఎగ్జామ్ జరిగే అవకాశమున్నట్టు మళ్లీ వార్తలొస్తున్నాయి. ఆర్ఆర్‌బీ పరీక్షల్ని నిర్వహించే బాధ్యతను ఇతర ఏజెన్సీలకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఇస్తుందని, దీనిపై ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చని ఆ వార్తల సారాంశం.

  మొత్తం 35,000 పైగా పోస్టులకు 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరంతా పరీక్ష తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త ఏజెన్సీ మార్చిలో ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష నిర్వహించే అవకాశముందని వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే లేదు. ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌కు సంబంధించి అక్టోబర్ 15న చివరిసారిగా ఆర్ఆర్‌బీ నుంచి నోటీసు వచ్చింది. "2019 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. రివైజ్డ్ షెడ్యూల్‌ను అన్ని ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లల్లో తర్వాత అప్‌లోడ్ చేస్తాం. అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్స్‌ను ఫాలో కావాలి" అన్నది ఆ నోటీసు సారాంశం. ఆర్ఆర్‌బీ పరీక్షలకు అప్లై చేసిన అభ్యర్థులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఫేక్ న్యూస్, ఫేక్ నోటీసులు పట్టించుకోకుండా ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఫాలో కావాలి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Metro Rail Jobs: ఢిల్లీ మెట్రో రైల్‌లో 1493 జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగింపు

  Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు

  First published:

  Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railways, RRB

  ఉత్తమ కథలు