Home /News /jobs /

RAILWAY RECRUITMENT BOARD GROUP D EXAM DATES 2022 ANNOUNCED CHECK HERE THE FULL DETAILS VB

RRB Group D Exam Dates: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. .

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే ఉద్యోగాల్లో ప్రస్తుతం ఎన్టీపీసీ వివిధ లెవల్స్ లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే గ్రూప్ డీ పరీక్షల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది.

రైల్వే ఉద్యోగాల్లో ప్రస్తుతం ఎన్టీపీసీ(RRB NTPC) వివిధ లెవల్స్ లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే గ్రూప్ డీ పరీక్షల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. గ్రూప్ డీ(Group D) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను రైల్వే శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలను ఆగస్టు 17 నుంచి వివిధ దశల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.  మూడేళ్లుగా దాదాపు ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్న ప‌రీక్ష ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ (RRB Group-D) పరీక్ష‌లు. ఎట్ట‌కేల‌కు రైల్వే బోర్డు(Railway Board) ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఎక్జామ్ డేట్స్(Exam Dates) విడుద‌ల చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఆర్ఆర్‌బీ కోల్ కత్తా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. త్వ‌ర‌లో అన్ని రీజియ‌న్‌ల‌లో ఈ నోటిఫికేష‌న్ అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. ఈ నోటిఫికేష‌న్ చూడాల‌నుకొనే వారు అధికారిక వెబ్‌సైట్‌ https://www.rrbkolkata.gov.in/ ను సంద‌ర్శించాలి.

ఇది చదవండి: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్.. రీ కౌంటింగ్ కావాలంటే ఇలా చేయండి


సీబీటీ ప‌రీక్ష విధానం..
ఆర్ఆర్ బీ గ్రూప్ డీ ప‌రీక్ష వంద మార్కులకు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 90 నిమిషాలు అంటే గంట‌న్న‌ర‌. ప్రతీ ప్ర‌శ్న‌కు ఒక్క నిమిషం క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. ప‌రీక్ష‌లో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబ‌ట్టి వేగం క‌చ్చిత‌త్వం చాలా అవ‌స‌రం.

సెల‌బ‌స్ వివ‌రాలు..

మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్ల‌మ్‌లు ఉంటాయి.

 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.

TS 10th Results Direct Link: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేస్తే 10 సెకన్లలో రిజల్ట్

కరెంట్ అఫైర్స్ - ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అన్ని అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌ల అధినేత‌లు, ఇటీవ‌ల అవార్డులు పొందిన వారి వివ‌రాలు వ‌చ్చి ఉండాలి.

జనరల్ అవేర్‌నెస్ - ప‌దో త‌ర‌గ‌తి వ‌రుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్ర‌స్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చ‌ద‌వాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, India Railways, JOBS, Railway exam, Rrb exams, Rrb group d

తదుపరి వార్తలు