హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇదే... చెక్ చేయండి ఇలా

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇదే... చెక్ చేయండి ఇలా

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇదే... చెక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్ ఇదే... చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

RRB NTPC application status | మీరు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేశారా? అయితే వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయండి. లింక్ ఇదే.

    ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులకు శుభవార్త. కొన్ని నెలల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది. పరీక్ష నిర్వహణకు కసరత్తు వేగవంతం అవుతోంది. డిసెంబర్ 15 నుంచి పరీక్షలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB. అయితే అంతకంటే ముందు జరగాల్సిన ప్రక్రియను పూర్తి చేస్తోంది ఆర్ఆర్‌బీ. ఎన్‌టీపీసీ అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది ఆర్ఆర్‌బీ. అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు తమ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా అన్నది చెక్ చేసుకోవాలి. తమ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి ఉంటారని పట్టించుకోకపోతే తర్వాత పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకో అభ్యర్థులందరూ ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ http://rrbonlinereg.co.in/ లో తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలి. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    IBPS Clerk 2020: ప్రభుత్వ బ్యాంకుల్లో 2557 క్లర్క్ ఉద్యోగాలు... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

    NGRI Recruitment 2020: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... జీతం రూ.67,000 వరకు

    ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు ముందుగా http://rrbonlinereg.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

    హోమ్ పేజీలో Application Status లింక్ క్లిక్ చేయండి.

    అన్ని ఆర్ఆర్‌బీ రీజియన్స్ జాబితా కనిపిస్తుంది.

    అందులో మీరు ఏ రీజియన్ నుంచి అప్లై చేస్తే ఆ రీజియన్ సెలెక్ట్ చేయండి.

    సికింద్రాబాద్ రీజియన్ అయితే Secunderabad పైన క్లిక్ చేయండి.

    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

    సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పైన మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.

    ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

    DRDO Jobs 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో జాబ్స్... నేరుగా ఇంటర్వ్యూ

    మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు పరీక్ష రాయడానికి అర్హత సాధించినట్టే. ఆ వివరాలను ప్రింట్ తీసుకొని కాపీ భద్రపర్చుకోండి. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కారణంతో సహా ఉంటుంది. ఫోటోలు, సంతకం సరిగ్గా లేకపోవడం, అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపకపోవడం, విద్యార్హతలు లేకపోయినా అప్లై చేయం లాంటి కారణాలతో దరఖాస్తులు రిజెక్ట్ అయ్యే అవకాశముంది.

    ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో 35,000 పైగా పోస్టులు భర్తీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 1,26,30,88 మంది అప్లై చేశారు. వీరిలో దరఖాస్తులు రిజెక్ట్ అయినవారిని మినహాయించి మిగతావారికి పరీక్షల్ని నిర్వహించనుంది ఆర్ఆర్‌బీ.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, RRB

    ఉత్తమ కథలు