హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

Railway Jobs: పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు

Railway Jobs: పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు వారమే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Railway Recruitment 2022 | భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుతోపాటు (RRB), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటుంది. ఓ నోటిఫికేషన్‌కు అప్లై చేయడానికి మరో వారం మాత్రమే గడువుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి అలర్ట్. వెస్టర్న్ రైల్వే పలు ఖాళీల భర్తీకి గత నెలలో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఖాళీలను (Sports Quota Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 21 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 4 లోగా అప్లై చేయాలి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

Railway Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...

 మొత్తం ఖాళీలు 21
 రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 2
 షూటింగ్ 2
 కబడ్డీ 3
 హాకీ 3
 వెయిట్ లిఫ్టింగ్ 2
 పవర్ లిఫ్టింగ్ 2
 పవర్ లిఫ్టింగ్ (వుమెన్) 1
 జిమ్నాస్టిక్2
 క్రికెట్ 3
 బాల్ బ్యాడ్మింటన్ 1

TSPSC Notification: నిరుద్యోగులకు అలర్ట్... 833 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Railway Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2022 సెప్టెంబర్ 5

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 4

విద్యార్హతలు- లెవెల్ 4, లెవెల్ 5 పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు 12వ తరగతి లేదా ఇంటర్ పాస్ కావాలి.

క్రీడార్హతలు- అభ్యర్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించినవారై ఉండాలి.

వయస్సు- 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు

దరఖాస్తు ఫీజు- రూ.500.

వేతనం- రూ.92,300 వరకు

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IT Jobs 2022: ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా.. ఈ కంపెనీలో 10 వేల ఖాళీలకు నియామకాలు..

Railway Recruitment 2022: అప్లై చేయండి ఇలా

Step 1- అభ్యర్థులు ముందుగా https://www.rrc-wr.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Notification for Recruitment against Sports Quota for the year 2022-23 ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

Step 3- Click here to Apply Online పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 5- అభ్యర్థులు తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- ఆ తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 7- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, JOBS, Railway jobs, Railways

ఉత్తమ కథలు