RAILWAY RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR 5636 APPRENTICE POSTS HERE APPLICATION PROCESS NS
Railway Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ రైల్వేలో టెన్త్ అర్హతతో 5 వేల జాబ్స్.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు ఈశాన్య సరిహద్దు రైల్వే (Northeast Frontier Railway-NFR) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈశాన్య సరిహద్దు రైల్వే (Northeast Frontier Railway-NFR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా అప్రంటీస్ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5636 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nfr.indianrailways.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే.. Step 1: అభ్యర్థులు మొదట nfr.indianrailways.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం ‘NFR recruitment 2022’ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3: అనంతరం అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసి.. సూచించిన డాక్యుమెంట్లను నమోదు చేయాల్సి ఉంటుంది. Step 4: అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేసి వివరాలను ఓ సారి చెక్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. Step 5: అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.