Home /News /jobs /

RAILWAY RECRUITMENT 2022 KONKAN RAILWAY CONDUCTING WALK IN INTERVIEW FOR 14 VACANCIES KNOW JOB NOTIFICATION DETAILS SS

Railway Jobs 2022: రైల్వేలో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూ... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs 2022: రైల్వేలో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూ... నోటిఫికేషన్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs 2022: రైల్వేలో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూ... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Konkan Railway Recruitment 2022 | రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. కొంకణ్ రైల్వేలో 14 పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interview) జరగనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

    కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) పలు ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ (Walk in Interview) నిర్వహిస్తోంది. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు 2 ఏళ్లు. ఆ తర్వాత అవసరాలను బట్టి మరో ఏడాది కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు 2022 ఫిబ్రవరి 7న వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరగనుంది. అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. కొంకణ్ రైల్వే అఫీషియల్ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    Konkan Railway Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...





























    మొత్తం ఖాళీలు14విద్యార్హతలుఅనుభవంవయస్సువేతనం
    అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్యాబ్రికేషన్)4సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో 8 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.45 ఏళ్ల లోపురూ.73,491
    సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఫ్యాబ్రికేషన్)10సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో 5 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.35 ఏళ్ల లోపురూ.58,819

    Constable Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    Konkan Railway Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2022 ఫిబ్రవరి 7

    వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే సమయం- ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

    వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే స్థలం- Executive Club, Konkan Rail Vihar, Konkan Railway Corporation Ltd. Sector-40, Seawoods (West), Navi Mumbai, 400706.

    విద్యార్హతలు- బీటెక్ లేదా బీఈ సివిల్, మెకానికల్ పాస్ కావాలి.

    ఎంపిక విధానం- దరఖాస్తుల స్క్రీనింగ్, ఇంటర్వ్యూ

    ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Post Office Jobs 2022: టెన్త్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... రూ.63,200 వేతనం


    వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కనీసం రెండు రోజులు అక్కడే ఉండేలా సిద్ధం కావాలి. సొంత ఖర్చులతో బస ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. టీఏ, డీఏ కూడా లభించదు. అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీకి 72 గంటల ముందు కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోవాలి. కోవిడ్ 19 నెగిటీవ్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఎంపికైనవారికి న్యూఢిల్లీ, రాయ్‌పూర్, సూరత్, అంబాలా, నాగ్‌పూర్‌తో పాటు ఇతర ఫ్యాబ్రికేషన్ హబ్‌లో పోస్టింగ్ లభిస్తుంది.

    కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ విషయానికి వస్తే ఇది భారతీయ రైల్వేకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ. నవీ ముంబై కేంద్రంగా కొంకణ్ రైల్వే పనిచేస్తుంది. మహారాష్ట్ర, గోవా, కర్నాటక రాష్ట్రాల్లో రైల్వే సేవల్ని అందిస్తోంది. కొంకణ్ తీరంలోని ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ రైళ్లు నడుస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2022, Job notification, JOBS, Railway jobs

    తదుపరి వార్తలు