పశ్చిమ రైల్వే నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది తాజాగా అప్రెంటీస్ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే (RRC WR) వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి చివరి రోజు జూన్ 27, 2022. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022-23 సంవత్సరానికి పశ్చిమ రైల్వే పరిధిలోకి వచ్చే వివిధ డివిజన్‌లు మరియు వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం మొత్తం 3612 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అర్హతలు..
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి జూన్ 27, 2022 నాటికి కనిష్ట వయసు 15 సంవత్సరాలు.. గరిష్ట వయోపరిమితి 24 సంవత్సరాలు మించి ఉండకూడదు
- 50% మార్కులతో 10+2 పరీక్షా విధానంలో మెట్రిక్యులేట్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, NCVT/SCVTకి అనుబంధంగా ఉన్న ITI సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా తప్పనిసరి.
CTET 2022: సీటెట్‌కు అప్లై చేస్తున్నారా? పరీక్ష విధానం, పాసింగ్ మార్క్స్ వంటి వివరాలు తెలుసుకోండి..
ఎంపిక విధానం..
- అభ్యర్థులను మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మెట్రిక్యులేషన్‌లో కనీసం 50% (మొత్తం) మార్కులలు, మరియు ITI పరీక్ష రెండింటిలోనూ దరఖాస్తుదారులు పొందిన మార్కుల శాతాన్ని సరాసరి తీసుకొని లిస్ట్ చేస్తారు.
- అనంతరం రాత పరీక్ష లేదా వైవా నిర్వహించి అభ్యర్థులను ఎంపకి చేస్తారు.
Layoff Season Continues: టెక్కీలకు షాక్.. ఒక్క నెలలో 15,000 మంది ఉద్యోగుల తొలగింపు
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.rrc-wr.com/ ను సందర్శించాలి.
Step 3 - అనంతరం Apprentice Notification No. RRC/WR/01/2022 నోటిఫికేషన్ ట్యాబ్‌ను క్లిక్ చేయాలి.
Step 4 - ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
Step 5 - తరువాత Click here to Apply Online ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 6 - అనంతరం న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్‌చేసి ఈ-మెయిల్, పుట్టిన తేదీ, వంటి ప్రాథమిక వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 7 - తప్పులు లేకుండా దరఖాస్తు ఫాం నింపిన తరువాత అభ్యర్థులు రూ. 100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది, అయితే SC/ST/PWD/మహిళలు దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
Step 8 - దరఖాస్తును సబ్‌మిట్ చేసి భవిష్యత్ అవసరాల కోసం కాపీని దాచుకోవాలి.
Step 9 - దరఖాస్తుకు జూన్ 27, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apprenticeship, Indian Railways, Job notification, Railway Apprenticeship, Railway jobs