హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 756 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

Railway Jobs: రైల్వేలో 756 ఉద్యోగాలు... ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు

దేశంలో రైలు ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితంగా మారబోతోంది. రైలు ప్రమాదాలను నివారించడానికి భారతీయ రైల్వే ఇప్పుడు అధునాతన సిగ్నలింగ్ సిస్టమ్ కవచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) తన రైల్వే లైన్లలో కొన్నింటిలో దీనిని ఏర్పాటు చేస్తుంది.

దేశంలో రైలు ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితంగా మారబోతోంది. రైలు ప్రమాదాలను నివారించడానికి భారతీయ రైల్వే ఇప్పుడు అధునాతన సిగ్నలింగ్ సిస్టమ్ కవచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) తన రైల్వే లైన్లలో కొన్నింటిలో దీనిని ఏర్పాటు చేస్తుంది.

Railway Jobs | భారతీయ రైల్వే పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేర్ డివిజన్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియన్ రైల్వేస్ వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) ద్వారా ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌తో (RRB) పాటు వేర్వేరు రైల్వే జోన్లు ఖాళీలను భర్తీ చేస్తుంటాయి. అందులో అప్రెంటీస్ పోస్టులు కూడా ఉంటాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వేర్వేరు డివిజన్లలో ఉన్న యూనిట్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 756 ఖాళీలు ఉన్నాయి. విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్‌లో 263 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 7 చివరి తేదీ. ఒకరు ఏదైనా ఒక యూనిట్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. వేర్వేరు డివిజన్లకు వేర్వేరు దరఖాస్తు ఫామ్స్ సబ్మిట్ చేస్తే పరిగణలోకి తీసుకోరు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

  East Coast Railway Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు756
  క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, మంచేశ్వర్, భువనేశ్వర్190
  ఖుర్దా రోడ్ డివిజన్237
  వాల్తేర్ డివిజన్263
  సంబాల్‌పూర్ డివిజన్66


  SSC Recruitment 2022: ఇంటర్ పాస్ అయినవారికి గవర్నమెంట్ జాబ్స్... అప్లై చేయండి ఇలా

  East Coast Railway Recruitment 2022: వాల్తేర్ డివిజన్‌లో ఖాళీల వివరాలు ఇవే...


   వాల్తేర్ డివిజన్‌లో ఖాళీలు 263
   ఫిట్టర్ 102
   వెల్డర్ 54
   టర్నర్ 11
   ఎలక్ట్రీషియన్ 50
   మెషినిస్ట్ 4
   డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) 4
   డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) 1
   రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ 1
   వైర్‌మ్యాన్ 10
   కార్పెంటర్ 9
   ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4
   ప్లంబర్ 7
   మేసన్ 6


  East Coast Railway Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2022 ఫిబ్రవరి 8

  దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 7 సాయంత్రం 5 గంటలు

  విద్యార్హతలు- 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

  వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు

  ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ

  దరఖాస్తు ఫీజు- రూ.100

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  NMDC Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్... రూ.1,30,000 వేతనంతో ఎన్ఎండీసీలో ఉద్యోగాలు

  East Coast Railway Recruitment 2022: దరఖాస్తు విధానం


  Step 1- అభ్యర్థులు https://etrpindia.com/rrc_bbn_act/index.php వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో Register పైన క్లిక్ చేయాలి.

  Step 3- పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, అడ్రస్, విద్యార్హతలు

  Step 4- లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

  Step 5- తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

  Step 7- ఆన్‌లైన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Govt Jobs 2022, Indian Railways, JOBS, Railway Apprenticeship, Railway jobs, Visakhapatnam

  ఉత్తమ కథలు