Home /News /jobs /

RAILWAY RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 5636 APPRENTICE POSTS HERE APPLICATION PROCESS NS

Railway Recruitment 2022: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. టెన్త్ అర్హతతో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ఈశాన్య సరిహద్దు రైల్వే ((Northeast Frontier Railway-NFR)) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఈశాన్య సరిహద్దు రైల్వే (Northeast Frontier Railway-NFR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా అప్రంటీస్ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5636 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nfr.indianrailways.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    ముఖ్యమైన తేదీలు:
    నోటిఫికేషన్ విడుదల: మే 30, 22.
    అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం: జూన్ 1 ఉదయం 11 గంటల నుంచి..
    దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ: జూన్ 30, రాత్రి 10 గంటల వరకు..
    Agneepath Scheme: 'అగ్నివీర్స్'కు స్పెషల్ బెనిఫిట్స్.. స్కిల్-బేస్డ్ బ్యాచిలర్ డిగ్రీలో క్రెడిట్ పాయింట్లు

    విద్యార్హతల వివరాలు:
    -అభ్యర్థులు టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.
    -అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.


    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదట nfr.indianrailways.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం ‘NFR recruitment 2022’ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం అప్లికేషన్ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసి.. సూచించిన డాక్యుమెంట్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
    Step 4: అప్లికేషన్ ఫామ్ లో నమోదు చేసి వివరాలను ఓ సారి చెక్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
    Step 5: అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు