RAILWAY RECRUITMENT 2021 SOUTH CENTRAL RAILWAY SECUNDERABAD RELEASED NOTIFICATION FOR VARIOUS JOBS VACANCIES NS
Railway Recruitment 2021: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. జోన్ల వారీగా వేర్వేరుగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ముఖ్యంగా కరోనా కల్లోలం నేపథ్యంలో మెడికల్ స్టాఫ్ సిబ్బంది నియామాలను చేపడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే (SCR)లో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 04, 05 తేదీల్లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, స్పెషల్ డాక్టర్, జీడీఎంఓ, స్టాఫ్ నర్స్, హాస్పటల్ అటెండెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. NTPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
అర్హతల వివరాలు.. జీడీఎంఓ: ఎంబీబీఎస్ పాసై ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని 53 ఏళ్లుగా నిర్ధారించారు. ఎంపికైన వారికి నెలకు రూ. 75 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్: ఆయా విభాగాల్లో ఎంబీబీఎస్ చేసి, పీజీ లేదా డిప్లొమో అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 53 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ. 95 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్: బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. వయస్సు 20-33 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 వరకు వేతనం చెల్లించనున్నారు. హాస్పటల్ అటెండెంట్: టెన్త్, ఐటీఐ పాసై జాతీయ అప్రెంటీస్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-33 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఫార్మసిస్టు: ఇంటర్, బీఫార్మసీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవయ్చు. వయస్సు 20-33 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 29,200 వరకు వేతనం చెల్లించనున్నారు. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్: బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఏడాది అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. వయస్సు 22-33 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,400 వరకు వేతనం చెల్లించనున్నారు. ల్యాబ్ అసిస్టెంట్: ఇంటర్ తో పాటు డీఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. వయస్సు 18-33 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 21700 వరకు వేతనం చెల్లించనున్నారు. Notification - Direct Link
ఎలా అప్లై చేయాలంటే..
అభ్యర్థులు తమ దరఖాస్తులను contractmedicalhyb@gmail.com కు పంపించాలని నోటిఫికేషన్లో సూచించారు. అప్లై చేయడానికి ఈ నెల 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. నోటిఫికేషన్ లోనే చివరలో అప్లికేషన్ ఫారం ఉంటుంది. అభ్యర్థులు ఆ అప్లికేషన్ ఫామ్ ను సూచించిన ఫార్మాట్లో నింపి టెన్త్ సర్టిఫికేట్, విద్యార్హత సర్టిఫికేట్, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల స్కానింగ్ కాపీలను జత చేసి పైన సూచించిన మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.