నార్త్ సెంట్రల్ రైల్వేస్(North Central Railways ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు క్రీడల్లో రాణించిన అభ్యర్థులు ఈ పోస్టులు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తిగా ఆన్లైన్ (Online)లోనే ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులను ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://www.rrcpryj.org/Notification.php నుసందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి డిసెంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
విభాగం | ఖాళీలు |
అథ్లెటిక్స్ | 04 |
బాడ్మెంటిన్ | 01 |
బాక్సింగ్ | 01 |
క్రికెట్ | 03 |
జిమ్నాస్టిక్స్ | 01 |
హకీ | 06 |
పవర్ లిఫ్టింగ్ | 01 |
టెన్నీస్ | 01 |
టేబుల్ టెన్నీస్ | 01 |
వెయింట్ లిఫ్టింగ్ | 01 |
CAT 2021 : "క్యాట్" క్వాలిఫై అవ్వలేకపోతున్నారా..? అయితే ఐఐఎంలో సీట్ పొందేందుకు ఇతర మార్గాలు ఇవే!
అర్హతలు..
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇంటర్మీడియట్, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత క్రీడల్లో ఒలపింక్స్, వరల్డ్ గేమ్, ఏసియన్ గేమ్స్, చాంపియన్ ట్రోఫీ, తత్సమ స్థాయిలో ప్రాతినిథ్యం వహించాలి.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉండాలి.
Online Courses: జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా..? రెజ్యూమె రైటింగ్‌పై ఉచిత ఆన్లైన్ కోర్స్
Step 2 : ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.rrcpryj.org/Notification.php ను సందర్శించాలి.
Step3 : అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అప్లికేషన్ ఫాంలోకి వెళ్లాలి.
Step 5 : ఆన్లైన్ దరఖాస్తును తప్పులు లేకుండా నింపాలి.
Step 6 : దరఖాస్తు పూర్తయిన తరువాత పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 7 : జనరల్ అభ్యర్థులకు రూ. 500 పరీక్ష ఫీజు, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్‌సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250 పరీక్ష ఫీజు ఉంటుంది.
Step 8 : దరఖాస్తు పూర్తయిన తరువాత అభ్యర్థి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
Step 9 : ఒక అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 10 : దరఖాస్తుకు డిసెంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Indian Railway, Job notification, JOBS, Railway jobs