Home /News /jobs /

RAILWAY RECRUITMENT 2021 JOBS IN NORTH CENTRAL RAILWAY APPLICATION PROCESS AND ELIGIBILIY EVK

Railway Recruitment 2021: నార్త్ సెంట్ర‌ల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, అర్హ‌త‌లు

రైల్వే ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాలు

నార్త్ సెంట్రల్ రైల్వేస్(North Central Railways ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు క్రీడ‌ల్లో రాణించిన అభ్య‌ర్థులు ఈ పోస్టులు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    నార్త్ సెంట్రల్ రైల్వేస్(North Central Railways ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది.  ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు క్రీడ‌ల్లో రాణించిన అభ్య‌ర్థులు ఈ పోస్టులు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. ఈ పోస్టుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ (Application Process) పూర్తిగా ఆన్‌లైన్‌ (Online)లోనే ఉంటుంది. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను ఎగ్జామినేష‌న్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.rrcpryj.org/Notification.php నుసంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    పోస్టుల వివ‌రాలు..















































    విభాగంఖాళీలు
    అథ్లెటిక్స్‌04
    బాడ్మెంటిన్‌01
    బాక్సింగ్‌01
    క్రికెట్‌03
    జిమ్నాస్టిక్స్‌01
    హ‌కీ06
    ప‌వ‌ర్ లిఫ్టింగ్‌01
    టెన్నీస్‌01
    టేబుల్ టెన్నీస్‌01
    వెయింట్ లిఫ్టింగ్‌01

    CAT 2021 : "క్యాట్‌" క్వాలిఫై అవ్వ‌లేక‌పోతున్నారా..? అయితే ఐఐఎంలో సీట్ పొందేందుకు ఇత‌ర మార్గాలు ఇవే!


    అర్హ‌త‌లు..
    - ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
    - ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
    - సంబంధిత క్రీడ‌ల్లో ఒల‌పింక్స్‌, వ‌ర‌ల్డ్ గేమ్‌, ఏసియ‌న్ గేమ్స్‌, చాంపియ‌న్ ట్రోఫీ, త‌త్స‌మ స్థాయిలో ప్రాతినిథ్యం వ‌హించాలి.

    DCCB Recruitment 2021: క‌డ‌ప‌ డీసీసీబీలో 75 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు


    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉండాలి.

    Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.rrcpryj.org/Notification.php ను సంద‌ర్శించాలి.

    Step3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 :  నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా అప్లికేష‌న్ ఫాంలోకి వెళ్లాలి.

    Step 5 : ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తును త‌ప్పులు లేకుండా నింపాలి.

    BEL Recruitment 2021: "బెల్‌"లో రిసెర్చ్ స్టాఫ్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు,అప్లికేష‌న్ ప్రాసెస్‌


    Bank Exam Preparation: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ఏం చ‌ద‌వాలి?


    Step 6 : ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత ప‌రీక్ష ఫీజు చెల్లించాలి.

    Step 7 :  జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 500 ప‌రీక్ష ఫీజు, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్‌స‌ర్వీస్ మ్యాన్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.250 ప‌రీక్ష ఫీజు ఉంటుంది.

    Step 8 :  ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత అభ్య‌ర్థి అప్లికేష‌న్‌ను స‌బ్‌మిట్ చేయాలి.

    Step 9 :  ఒక అప్లికేష‌న్ కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

    Step 10 :  ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 12, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, India Railways, Job notification, Railway jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు