హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment 2021 : రైల్వేలో 782 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే అవ‌కాశం

Railway Recruitment 2021 : రైల్వేలో 782 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ద‌ర‌ఖాస్తుకు వారం రోజులే అవ‌కాశం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory), చెన్నైలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 782 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబర్ 26, 2021 వరకు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (Integral Coach Factory), చెన్నైలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ (Electrician), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ (Painter) మరియు వెల్డర్ విభాగాల్లో 782 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ నోటిఫికేష‌న్ 27 సెప్టెంబర్ 2021 న విడుదలైంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి 27 సెప్టెంబర్ 2021 నుండి 26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ (University) నుంచి అభ్య‌ర్థి ప‌ది, ప‌న్నెండో త‌ర‌గ‌తి చ‌దివి ఉండాలి. పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://pb.icf.gov.in/act/ ను సంద‌ర్శించాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి చ‌ద‌వండి.

  ముఖ్య‌మైన స‌మాచారం..

  పోస్టు పేరుఅప్రెంటీస్‌
  మొత్తం ఖాళీలు 782
  ద‌ర‌ఖాస్తుల ప్రారంభంసెప్టెంబ‌ర్ 27, 2021
  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 27, 2021
  అధికారిక వెబ్‌సైట్https://pb.icf.gov.in/act/


  ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇండియాలోని తొలి ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. ఇది అక్టోబర్ 2, 1955 న ప్రారంభించబడింది. 511 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంస్థ‌లో 4000 కంటే ఎక్కువ కోచ్‌లను ఉత్పత్తి చేయడానికి 9500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

  SSC Recruitment 2021: ఎస్ఎస్‌సీలో ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి


  పోస్టుల వివ‌రాలు..

  పోస్టుపేరుఫ్రెష‌ర్స్ విభాగంఎక్స్‌-ఐటీఏ విభాగం
  కార్పెంట‌ర్‌3150
  ఎల‌క్ట్రీషియ‌న్‌17128
  ఫిట్ట‌ర్‌43151
  మెక‌నిస్టు2532
  పైయింట‌ర్‌3449
  వెల్డ‌ర్‌50172
  మొత్తం200582


  అర్హ‌త‌లు..

  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 లేదా 12 ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా, సంబంధిత ట్రేడ్‌లో ITI డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు అక్టోబర్ 26, 2021 నాటికి 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపు 3 సంవత్సరాలు అయితే SC మరియు ST అభ్యర్థుల వరకు సడలింపు ఉంటుంది 5 సంవత్సరాలు.


  Delhi University jobs 2021: యూనివ‌ర్సిటీ ఆఫ్ ఢిల్లో 251 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం


  ఎంపిక ప్ర‌క్రియ..

  - ఎంపిక విధానం పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.

  - అభ్య‌ర్థి అకాడ‌మిక్ అర్హ‌త‌ల ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1:  కేవ‌లం ఆన్‌లైన్ ద్వార మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  Step 2:  ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు https://pb.icf.gov.in/act/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

  Step 3:  అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4:  త‌రువాత How to Apply ఆప్ష‌న్‌లోకి వెళ్లి అప్లికేష‌న్ విధానం చ‌ద‌వాలి.

  అనంత‌రం అప్లె చేయాలి.

  Step 5:  అభ్య‌ర్థికి ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి విద్యార్హ‌త‌కు సంబంధించిన పూర్తి ధ్రువ‌ప‌త్రాల‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

  Step 6: ద‌ర‌ఖాస్తు అనంత‌రం ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  Step 7: ప‌రీక్ష ఫీజు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు.

  Step 8: ద‌ర‌ఖాస్తు అనంత‌రం అప్లికేష‌న్ ఫాంను ప్రింటు తీసుకొని దాచుకోవాలి.

  Step 9:  ద‌ర‌ఖాస్తుకు  26 అక్టోబర్ 2021 వరకు అవ‌కాశం ఉంది

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Govt Jobs 2021, Indian Railway, Job notification, JOBS

  ఉత్తమ కథలు