Railway Jobs: 1,47,620 గ్రూప్ సీ పోస్టుల భర్తీ... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Railway Recruitment 2020 | 2018 లో మొత్తం 64,371 అసిస్టెంట్ లోకో పైలట్స్, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేసింది రైల్వే.

news18-telugu
Updated: March 12, 2020, 3:38 PM IST
Railway Jobs: 1,47,620 గ్రూప్ సీ పోస్టుల భర్తీ... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Railway Jobs: 1,47,620 గ్రూప్ సీ పోస్టుల భర్తీ... ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేలో రెండుమూడేళ్లుగా ఉద్యోగాల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా గత మూడేళ్లలో 1,47,620 గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేసినట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. మూడు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, మరికొన్ని నెలల్లో ఈ ప్రాసెస్ పూర్తవుతుందని వివరించారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB, రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC ద్వారా 2017-18 నుంచి 2019-2020 మార్చి 5 వరకు లెవెల్ 1 పోస్టులతో పాటు 1,47,620 గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేశామని ఆయన అన్నారు.

ఇక 2019-2020 సంవత్సరంలో 1,280 మహిళలు భారతీయ రైల్వేలో ఇంజన్ డ్రైవర్లుగా చేరారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 2018 లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మహిళల్ని అసిస్టెంట్ లోకో పైలట్లుగా నియమించింది రైల్వే. 2018 లో మొత్తం 64,371 అసిస్టెంట్ లోకో పైలట్స్, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేసింది రైల్వే. ఈ పోస్టులకు 47.45 లక్షల మంది దరఖాస్తు చేయడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 131, తెలంగాణలో 33 మంది మహిళలు అసిస్టెంట్ లోకో పైలట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాలు... మార్చి 14 లాస్ట్ డేట్

DRDO Jobs: హైదరాబాద్ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... మార్చి 14 లాస్ట్ డేట్

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: March 12, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading