రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి కోసం వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. భారతీయ రైల్వేలో వేర్వేరు విభాగాల్లో, వేర్వేరు కోటాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 13 చివరి తేదీ. www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌సీ బిలాస్‌పూర్ స్పోర్ట్స్ కోటా లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
మొత్తం ఖాళీలు- 26
అథ్లెటిక్స్ (పురుషులు)- 1
అథ్లెటిక్స్ (మహిళలు)- 1
బ్యాడ్మింటన్ (పురుషులు)- 2
బ్యాడ్మింటన్ (మహిళలు)- 2
బాస్కెట్ బాల్ (పురుషులు)- 2
బాస్కెట్ బాల్ (మహిళలు)- 2
బాక్సింగ్ (మహిళలు)- 3
క్రికెట్ (పురుషులు)- 4
హ్యాండ్‌బాల్ (మహిళలు)- 3
హాకీ (పురుషులు)- 3
కబడ్డీ (పురుషులు)- 1
ఖో ఖో (పురుషులు)- 1
వాలీబాల్ (పురుషులు)- 1
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 13
విద్యార్హత- నాన్ టెక్నికల్ పోస్టుకు 12వ తరగతి, టెక్నికల్ పోస్టుకు 10వ తరగతితో పాటు ఐటీఐ.
వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Inter Jobs: ఇంటర్ పాసైతే ఈ 7 జాబ్ నోటిఫికేషన్లు మీ కోసమే
Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలు... జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే
SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్... ఎగ్జామ్ సిలబస్ ఇదే
EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railways