హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వేలో ఉద్యోగాలకు పలు నోటిఫికేషన్లు... మొత్తం 7564 జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Railway Recruitment 2019 | రైల్వేలో ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

  రైల్వేలో ఉద్యోగం మీ కలా? ఎలాగైనా రైల్వేలో జాబ్ సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. భారతీయ రైల్వేకు చెందిన పలు జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. సుమారు 7,000 పైగా ఉద్యోగాలున్నాయి. వేర్వేరు విభాగాల్లో, వేర్వేరు కోటాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. 3429 పోస్టుల్ని నియమించేందుకు సదరన్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. సదరన్ రైల్వే పరిధిలోకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చెరి, అండమాన్ & నికోబార్ ఐల్యాండ్స్, లక్షద్వీప్‌ వస్తాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. భారీగా ఖాళీలను భర్తీ చేస్తోంది. ఏకంగా 1216 పోస్టుల్ని ప్రకటించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేర్ డివిజన్‌లో 553 పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఈశాన్య రైల్వే మరో 1104 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ner.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ. www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌సీ బిలాస్‌పూర్ స్పోర్ట్స్ కోటా లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఉత్తర మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 296 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://ncr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  భారతీయ రైల్వేలోనే కాదు... ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-DMRC కూడా భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 1493 ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ http://www.delhimetrorail.com/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  రైల్వేలో ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Redmi K20 Pro: తక్కువ ధర, అదిరిపోయిన ఫీచర్స్... రెడ్‌మీ కే20, రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Google Jobs 2020: గూగుల్‌లో ఉద్యోగాల జాతర... త్వరలో ఇండియాలో 3,800 పోస్టుల భర్తీ

  ISRO Recruitment 2019: ఇస్రోలో 80 ఉద్యోగాలతో మూడో నోటిఫికేషన్... వివరాలివే

  Coal India Jobs: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1326 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhrapradesh, AP News, CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railway employees, Railways, RRB, South Central Railways

  ఉత్తమ కథలు