హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

RRB Group D Update: RRB Group D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలకు సంబంధించి నోటీస్ విడుదల..

RRB Group D Update: RRB Group D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలకు సంబంధించి నోటీస్ విడుదల..

RRB Group D Update: RRB Group D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలకు సంబంధించి నోటీస్ విడుదల..

RRB Group D Update: RRB Group D అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలకు సంబంధించి నోటీస్ విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D ఫేజ్ 3 పరీక్ష తేదీలను ప్రకటించింది. RRB గ్రూప్ D లెవెల్-1 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు rrbcdg.gov.in అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన నోటీసును చూసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గ్రూప్ D ఫేజ్ 3 పరీక్ష తేదీలను ప్రకటించింది. RRB గ్రూప్ D లెవెల్-1 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు rrbcdg.gov.in అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా పరీక్షకు సంబంధించిన నోటీసును చూసుకోవచ్చు. నోటీసు ప్రకారం.. ఫేజ్-III పరీక్ష(Phase 3 Exam) సెప్టెంబర్ 08 నుండి సెప్టెంబర్ 19, 2022 వరకు నిర్వహించబడుతుంది. RRB జారీ చేసిన నోటీసు ప్రకారం.. అభ్యర్థులు ఆగస్టు 30 నుండి పరీక్ష తేదీ అండ్ సెంటర్ ను వెబ్ సైట్(Web site) ద్వారా తెలుసుకోవచ్చు. RRB పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ జారీ చేస్తుంది. అభ్యర్థులు అధికారిక సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 08 సెప్టెంబర్ 2022న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 4 నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ పరీక్ష దేశంలోని వివిధ నగరాల్లో నాలుగు RRCల ఈస్ట్ కోస్ట్ రైల్వే (భువనేశ్వర్), నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (గౌహతి), ఉత్తర రైల్వే (న్యూఢిల్లీ) మరియు దక్షిణ రైల్వే (చెన్నై) కోసం నిర్వహించబడుతుంది.


Telangana Government Key Announcement: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ 9 వేల మంది సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులే..!


ఆగస్టు 17 నుంచి మొదలైన ఈ పరీక్షలు సౌత్ సెంట్రల్ రైల్వే కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష ముగిసింది. మొదటి ఫేస్ లో ఈ పరీక్షలను నిర్వహించారు. మొత్తం మూడు రైల్వే బోర్టులకు సెకండ్ ఫేస్ ఆగస్టు 25తో ముగిసింది. ప్రస్తుతం ఆగస్టు 26 నుంచి ఫేస్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా ఫేజ్ 3 పరీక్షల షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.నోటీసును ఇలా చూసుకోవచ్చు.


Step 1: నోటీసును తనిఖీ చేయడానికి.. అభ్యర్థులు ముందుగా అధికారిక సైట్ rrbcdg.gov.inని సందర్శించండి.


Step 2: ఆ తర్వాత హోమ్‌పేజీలో ఇచ్చిన CBT 3 దశ పరీక్షల జాబితా లింక్‌పై క్లిక్ చేయండి.


Step 3: ఇప్పుడు పరీక్షకు సంబంధించిన నోటీసు అభ్యర్థి స్క్రీన్‌పై కనిపిస్తుంది.


Step 4: అభ్యర్థులు ఈ నోటీసును డౌన్‌లోడ్ చేసి చదువుకోవాలి. అందులో ప్రతీ అంశం గురించి వివరంగా పొందుపరిచారు.


Tenth-Degree Jobs: పది, డిగ్రీ పాస్ అయ్యారా.. అయితే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో ఈ పోస్టులు మీ కోసమే..


అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..


Step 1: ముందుగా.. అభ్యర్థి అధికారిక సైట్ —rrbcdg.gov.in ని సందర్శించాలి.


Step 2: అభ్యర్థి హోమ్‌పేజీలో ఇచ్చిన అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.


Step 3: దీని తర్వాత.. అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు.. పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. తర్వాత డౌన్ లోడ్ అడ్మిట్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


Step 4: తర్వాత అభ్యర్థి అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.


Step 5: ఇప్పుడు అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.


Step 6: చివరగా.. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Railway jobs, Rrb group d

ఉత్తమ కథలు