Home /News /jobs /

RAILWAY MINISTER SHRI ASHWINI VAISHNAW ASSURES RRB NTPC CANDIDATES TO ADDRESS THEIR CONCERNS OVER RAILWAY EXAM NS

RRB NTPC అభ్యర్థులకు అలర్ట్... రైల్వే మంత్రి కీలక ప్రకటన

రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్(ఫైల్ ఫొటో)

రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్(ఫైల్ ఫొటో)

RRB NTPC ఫలితాలపై అభ్యర్థుల్లో ఆందోళనలను వ్యక్తం అవడంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరో సారి స్పందించారు. అభ్యర్థులకు భరోసానిచ్చారు. ఆయన ఏమన్నారంటే..

    ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ (RRB NTPC) లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) మరో సారి స్పందించారు. డీడీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ.. ఈ ఫలితాలకు సంబంధించి వివిధ అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని అత్యంత సున్నితంగా హ్యాండిల్ చేస్తున్నట్లు వివరించారు. సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే కమిటీ అభ్యర్థుల నుంచి వినతులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వ్యక్తం చేస్తున్న ప్రతీ సమస్యను అత్యంత సున్నితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.

    గతంలో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కు ఖాళీల సంఖ్యకు పది రెట్ల మంది అభ్యర్థులను ఎంపిక చేసే విధానం ఉండేదని చెప్పారు. అయితే. CEN/02/2015 నోటిఫికేషన్ సమయానికి ఈ సంఖ్య 15 రెట్లు CEN1/2019 నోటిఫికేషన్ సమయానికి అభ్యర్థుల సంఖ్య 20 రెట్లకు చేరిందన్నారు. అయితే ఒక అభ్యర్థి ఒక కేటగిరీ కన్నా ఎక్కువ కేటగిరీలకు దరఖాస్తు చేయడంతో ఈ సమస్య వచ్చిందని మంత్రి చెప్పారు. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఐదు వేర్వేరు లెవల్స్ లో ఉంటుందన్నారు.
    Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ తప్పు చేస్తే జీవితంలో రైల్వే ఉద్యోగం రాదు

    దీంతో ఒక అభ్యర్థి పేరు ఒకటికన్నా ఎక్కువ జాబితాల్లో ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కారిస్తామన్నారు. విద్యార్థులు రోడ్లుపైకి వచ్చి ఆందోళనలు చేయడం, రైల్వే ప్రాపార్టీలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. అభ్యర్థులు వారి వినతులు సందేహాలను కమిటీకి ఫిబ్రవరి 16లోగా సమర్పించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలోని అధికారులు నియామక ప్రక్రియలో అపార అనుభవం కలిగిన వారని మంత్రి వివరించారు.
    RRB NTPC Results: రైల్వే ఫ‌లితాల‌పై నిర‌స‌న‌.. స్టేషన్‌లో అభ్య‌ర్థుల ఆందోళ‌న‌.. నిలిచిపోయిన రైళ్లు



    దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ శిబిరాలను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను హైవపర్ కమిటీకి ఫార్వర్డ్ చేయనున్నారు. ఎన్టీపీసీ ఎగ్జామ్ కు హాజరైన అభ్యర్థులు ఈ శిబిరాలను సందర్శించి వారి సందేహాలను వ్యక్తం చేయవచ్చు. ఇందుకు దరఖాస్తు నమూనాను సైతం సౌత్ సెట్రల్ రైల్వే విడుదల చేసింది. దరఖాస్తులో వారి సందేహాలను, వాటిని ధ్రువీకరించే పత్రాలను, మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: NTPC, Railway jobs, RRB

    తదుపరి వార్తలు