Railway Jobs: రైల్వే​లో 492 అప్రెంటీస్ ఉద్యోగాలు.. పదో తరగతి మార్కుల ఆధారంగా సెలక్షన్​.. ఫూర్తి వివరాలు

(ప్రతీకాత్మక చిత్రం)

Rail‌ways Recruitment: రైల్వే అనుబంధ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ సంస్థ అయిన చిత్తరంజన్‌ లోకోమోటివ్​ వర్క్స్​లో 492 అప్రెంటీస్​ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

  • Share this:
భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేల్వే అనుబంధ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ సంస్థ అయిన చిత్తరంజన్‌ లోకోమోటివ్​ వర్క్స్​లో 492 అప్రెంటీస్​ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అప్రెంటీస్​ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 3లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అర్హత, దరఖాస్తు విధానం, ఫీజు వంటి అన్ని వివరాల కోసం www.apprenticeshipindia.org వెబ్​సైట్​ను సందర్శించాలని అభ్యర్థులను కోరింది.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, పెయింటర్, ఎసి మెకానిక్ వంటి ఐటీఐ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 2021 సెప్టెంబర్ 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపింది. అయితే, రిజర్వేషన్​ నిబంధనల ప్రకారం ఆయా అభ్యర్థులకు గరిష్ట వయో సడలింపు ఉంటుంది. అర్హత విషయానికి వస్తే.. రాష్ట లేదా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాక, సంబంధిత ట్రేడ్​ విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

* ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.org అధికారిక వెబ్‌సైట్​ను ఓపెన్​ చేయాలి.
మొదట వారి పేరు, ఈ–మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్​ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సబ్​మిట్​ చేయాలి.
రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు వారి డాక్యుమెంట్లను పరిశీలించి మెరిట్​ లిస్ట్​ తయారు చేస్తుంది.

Green Chilli: పచ్చి మిర్చిను దూరం పెడుతున్నారా ?..ఈ ప్రయోజనాలు మిస్ అవుతారు

Revanth Reddy: యముడి గెటప్‌లో రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

* ఎంపిక ప్రక్రియ ఇలా..
ఈ అప్రెంటీస్​ పోస్టులను పదోతరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల మార్కులు, కేటగిరీ, వయస్సు ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మెరిట్​ లిస్ట్​ తయారు చేస్తారు. ఎంపికైన అయిన అభ్యర్థుల ఈ–మెయిల్ ఐడీకి కాల్ లెటర్‌ను పంపిస్తారు.
Published by:Kishore Akkaladevi
First published: