Railway Jobs: రైల్వేలో 1400 పైగా ఉద్యోగాలు... వివరాలివే

Railway Jobs | వేర్వేరు రైల్వే జోన్లు భర్తీ చేస్తున్న పోస్టులేంటీ? అర్హతలేంటీ? దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? తెలుసుకోండి.

news18-telugu
Updated: July 9, 2019, 11:25 AM IST
Railway Jobs: రైల్వేలో 1400 పైగా ఉద్యోగాలు... వివరాలివే
Railway Jobs: రైల్వేలో 1400 పైగా ఉద్యోగాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 9, 2019, 11:25 AM IST
రైల్వేలో ఉద్యోగాల మేళా కొనసాగుతోంది. ఓవైపు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB పోస్టుల్ని భర్తీ చేస్తుంటే మరోవైపు రైల్వే జోన్లు ప్రత్యేకంగా నియామక ప్రక్రియ చేపట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లల్లో ప్రస్తుతం 1400 పైగా పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా రైల్వే జోన్ల వెబ్‌సైట్లలోకి వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. మరి వేర్వేరు రైల్వే జోన్లు భర్తీ చేస్తున్న పోస్టులేంటీ? అర్హతలేంటీ? దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? తెలుసుకోండి.

South East Central Railway Recruitment: ఆగ్నేయ మధ్య రైల్వే 462 పోస్టుల్ని భర్తీ చేయనుంది. అందులో 90 Copa, 40 స్టెనోగ్రాఫర్, 80 ఫిట్టర్, 50 ఎలక్ట్రీషియన్, 50 వైర్‌మెన్, 6 ఎలక్ట్రానిక్ / మెకానిక్, 6 RAC మెకానిక్, 40 వెల్డర్, 40 ప్లంబర్, 10 మేసన్, 10 పెయింటర్, 10 కార్పెంటర్, 10 మెషినిస్ట్, 10 టర్నర్, 10 షీట్ మెటల్ వర్కర్ పోస్టులున్నాయి. దరఖాస్తు చేయడానికి జూలై 15 చివరి తేదీ. 12వ తరగతి లేదా ఐటీఐ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 15 నుంచి 24 ఏళ్లు.

South Western Railway Recruitment: నైరుతి రైల్వే 117 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 42 స్టేషన్ మాస్టర్, 20 గూడ్స్ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేయడానికి జూలై 15 చివరి తేదీ. 18 నుంచి 42 ఏళ్లలోపు వాళ్లు దరఖాస్తు చేయొచ్చు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు ఇంటర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ పోస్టులకు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.

Central Railway Recruitment: సెంట్రల్ రైల్వే 7 జూనియర్ ఇంజనీర్ / జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి జూలై 19 చివరి తేదీ. సివిల్ ఇంజనీరింగ్‌లో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ, 3 ఏళ్ల డిప్లొమా లేదా బీఎస్సీచదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.



North East Frontier Railway Recruitment: ఈశాన్య సరిహద్దు రైల్వే మెడికల్ కేటగిరీలో 14 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. జూలై 15న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 9 నర్సింగ్ సూపరింటెండెంట్, 2 హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, 1 ల్యాబ్ అసిస్టెంట్, 1 ఫార్మాసిస్ట్, 1 ఈసీజీ టెక్నీషియన్ పోస్టులున్నాయి.

Western Railway Recruitment: పశ్చిమ రైల్వే 18 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో 9 లోకో ఇన్‌స్పెక్టర్ పోస్టులతో పాటు ఇతర ఖాళీలున్నాయి. దరఖాస్తు చేయడానికి జూలై 12 చివరి తేదీ. 12 సీనియర్ రెసిడెంట్ పోస్టులున్నాయి. దరఖాస్తుకు జూలై 11 చివరి తేదీ.

Western Railway Recruitment: వెస్టర్న్ రైల్వే డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్ ద్వారా టికెట్ క్లర్క్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 135 స్టేషన్ మాస్టర్, 100 గూడ్స్ గార్డ్, 129 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 238 కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 105 జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 18 ట్రైన్స్ క్లర్క్ పోస్టులున్నాయి. దరఖాస్తుకు జూలై 30 చివరి తేదీ.
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: జూనియర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ
First published: July 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...