భారతీయ రైల్వేలో పలు జాబ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇండియన్ రైల్వేస్‌తో పాటు రైల్వే అనుబంధ సంస్థలు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. ప్రస్తుతం 3 నోటిఫికేషన్లలో 3967 పోస్టులున్నాయి. వాటికి దరఖాస్తు ప్రక్రియ చాలాకాలం క్రితమే ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరి ఏఏ నోటిఫికేషన్లలో ఏ పోస్టులున్నాయి? మీ విద్యార్హతలకు తగ్గ ఖాళీలున్నాయా? ఎలా అప్లై చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. పశ్చిమ రైల్వే 3,553 ఖాళీలను ప్రకటించింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టుల దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
2. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 6 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
3. పశ్చిమ రైల్వే మరో నోటిఫికేషన్ ద్వారా 14 ఖాళీలను భర్తీ చేస్తోంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఖాళీలివి. లెవెల్ 1 లో 12 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Jobs: స్పోర్ట్స్ అథారిటీలో 347 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
Police Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డిపార్ట్మెంట్లో 15,000 ఖాళీలుPublished by:Santhosh Kumar S
First published:February 04, 2020, 11:30 IST