హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వేలో 2077 ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తి పాస్ అయితే చాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

Railway Jobs: రైల్వేలో 2077 ఉద్యోగాలు.. ప‌దోత‌ర‌గ‌తి పాస్ అయితే చాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Railways Jobs | ఉద్యోగార్థ‌లుకు ఇండియ‌న్ రైల్వే శుభవార్త చెప్పింది. ప‌దోత‌ర‌గ‌తి పాసైన వారికి మంచి అవ‌కాశం ఇచ్చింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) యొక్క వివిధ ట్రేడ్‌లలో 2077 అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఇంకా చదవండి ...

ఉద్యోగార్థ‌లుకు ఇండియ‌న్ రైల్వే శుభవార్త చెప్పింది. ప‌దోత‌ర‌గ‌తి పాసైన వారికి మంచి అవ‌కాశం ఇచ్చింది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) యొక్క వివిధ ట్రేడ్‌లలో 2077 అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయనున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌.. నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://secr.indianrailways.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. అయితే నాగ్‌పూర్ డివిజన్ కోసం దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ జూన్ 3, 2022 వ‌ర‌కు, రాయ్‌పూర్ డివిజన్ కోసం దరఖాస్తు సమర్పించడానికి మే 24, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

పోస్టుల వివ‌రాలు..

నాగ్‌పూర్ డివిజన్ కోసం పోస్టుల సంఖ్య : 1044

రాయ్‌పూర్ డివిజన్ కోసం ఖాళీల సంఖ్య: 1033

విద్యార్హ‌త‌లు

- అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేయాలంటే..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.apprenticeshipindia.gov.in/login ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో కనిపించే ‘Online application for engagement of apprentices for the year 2022’ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కావాల్సిన అన్ని వివరాలను నమోదు చేయాలి. సూచించిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 4: అప్లికేషన్ ఫామ్ నింపడం పూర్తయిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 5: అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.

First published:

Tags: Indian Railway, Indian Railways, Railway jobs

ఉత్తమ కథలు