ఇటీవల రైల్వే నుంచి భారీగా ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా నార్త్ వెస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రికల్, కార్పెంటర్, ఫిట్టర్, మెకానికల్, పెయింటర్ వంటి వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 2026 ఖాళీలకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మీరు టెన్త్ తో పాటు, ఐటీఐ విద్యార్హతను కలిగి ఉంటే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను RRC జైపూర్ వెబ్‌సైట్ rrcjaipur.in వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 10 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతల వివరాలు:
మీరు అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే.. మీరు టెన్త్ పాసై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసినట్లు సర్టిఫికెట్ కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15-24 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
Jobs In Zomato: జొమాటోలో ఉద్యోగాలు .. పోస్టుల వివరాలు , అర్హతలివే..
ఎంపిక ఇలా..
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్‌షిప్ కోసం అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితా రూపొందించబడుతుంది.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఉచితం. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.100. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, Railway jobs