నిరుద్యోగులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే (South Western Railway) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 147 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఖాళీలు విద్యార్హతల వివరాలు: గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 147 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ 147 ఖాళీల్లో 84 అన్ రిజర్వ్డ్ కాగా, ఎస్సీలకు 21, ఎస్టీలకు 10, ఓబీసీలకు 32 కేటాయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు 42, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్టీ, ఎస్సీలకు 47 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు.
అప్లికేషన్ ఫీజు: ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Jobs in Telangana: డీఎంహెచ్ఓలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు ఒక్క రోజే చాన్స్
Ts Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. పోలీస్ రవాణాశాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
ఎలా అప్లై చేయాలి..
Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ https://www.rrchubli.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం నోటిఫికేషన్ లింక్ పక్కన Click here to submit online application ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: మొదటగా పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేయాలి. అనంతరం Start Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళా.. రెండు రోజులే చాన్స్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్.ఈనెల 30, మే 1న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్‌మేళా నిర్వహించబోతున్నాయి. కనీసం 5 వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో(Private Sector) కల్పించడం జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 10వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అర్హులైన వారంతా ఆయా జాబ్‌మేళాలకు హాజరు కావొచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://ysrcpjobmela.com/ ను సందర్శించాలి.
Step 3 - మీరు తిరుపతి, వైజాక్, గుంటూర్ దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంటుంది.
Jobs in AP: నెల్లూరులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక
Step 4 - ఆయా తేదీల్లో Apply Now క్లిక్ చేసి దరఖాస్తు మొదలు పెట్టాలి.
Step 5 - Full Name , Contact Number, Mail id ద్వారా దరఖాస్తు ఫాం నింపాలి.
Step 6 - తప్పులు లేకుండా నింపిన తరువాత.. సబ్‌మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Job notification, JOBS