Railway Jobs: భారతీయ రైల్వేలో 15,498 ఉద్యోగాలు... నోటిఫికేషన్ల వివరాలు ఇవే

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... భారతీయ రైల్వేలో 15,498 ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs | భారతీయ రైల్వే వేర్వేరు జాబ్ నోటిఫికేషన్ల (Job Notification) ద్వారా దేశవ్యాప్తంగా 15,498 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    నిరుద్యోగులకు అలర్ట్. భారతీయ రైల్వేలో ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notifications) విడుదలవుతున్నాయి. వేల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేస్తోంది ఇండియన్ రైల్వేస్. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేతో (South Central Railway) పాటు వెస్ట్ సెంట్రల్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, నార్తర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లు వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశాయి. వేల సంఖ్యలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 15,498 పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. ఈ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

    ONGC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    South Central Railway Recruitment 2021: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే 4,103 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    West Central Railway Recruitment 2021: వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 2226 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

    SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాస్ అయితే చాలు

    Eastern Railway Recruitment 2021: ఈస్టర్న్ రైల్వే మొత్తం అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 2,945 ఖాళీలున్నాయి. వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్‌మెన్, వైర్‌మెన్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Northern Railway Recruitment 2021: నార్తర్న్ రైల్వే 3093 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, కార్పెంటర్ లాంటి పోస్టులు ఉన్నాయి. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ONGC Recruitment 2021: ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... ఆ డిగ్రీ ఉంటే చాలు

    East Central Railway Recruitment 2021: ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల‌ భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 2206 పోస్టులున్నాయి. అప్లై చేయడానికి 2021 నవంబర్ 5 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    South Western Railway Recruitment 2021: సౌత్ వెస్టర్న్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 904 ఖాళీలను ప్రకటించింది. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. మరిన్ని వివరాలను ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

    Southern Railway Recruitment 2021: సదరన్ రైల్వే 21 ఖాళీలను భర్తీ చేస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 నవంబర్ 30 చివరి తేదీ. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published: