RAILWAY EXAMS SOON RAILWAY RRB GROUP D PREPARATION PLAN AND EXAM PATTERN EVK
Railway Exams: త్వరలో రైల్వే ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ.. ప్రిపరేషన్ ప్లాన్, ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రతీకాత్మక చిత్రం
RRB Group D Exam Preparation | జూలై నుంచి వివిధ దశల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సిద్ధం అయ్యే విద్యార్థుల కోసం సెలబస్, పరీక్ష విధానంతెలుసుకోవడం అవసరం..
లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్ డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఈ పరీక్షలను జూలై నుంచి వివిధ దశల్లో నిర్వహించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) సన్నాహాలు చేస్తుంది. ఈ పరీక్షలకు ఇంకా కేవలం కొంత సమయంల మాత్రమే ఉంది. ఇప్పటికే ఎన్‌టీపీసీ (NTPC)లో 30,000 ఉద్యోగాలకు రిజల్ట్ వచ్చాయి. ఈ సారి కట్ ఆఫ్ అంచనాలకు మించి ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్-డీ కూడా అదే స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ పకడ్బందీగా ఉండాలి. గ్రూప్-డీ పరీక్షకు సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ సారి 1-1 పద్ధతిలో ఎంపిక చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పక్క ప్రిపరేషన్ ప్లాన్‌తో కనుక పరీక్షకు సిద్ధం అయితే ఈ సారి జాబ్ మీ సొంతం.
ఆర్ఆర్ బీ గ్రూప్ డీ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు అంటే గంటన్నర. ప్రతీ ప్రశ్నకు ఒక్క నిమిషం కన్నా తక్కువ సమయం ఉంటుంది. పరీక్షలో నెగెటీవ్ మార్కులు ఉంటాయి కాబట్టి వేగం కచ్చితత్వం చాలా అవసరం.
సెలబస్ వివరాలు..
మ్యాథమెటిక్స్ - నెంబర్ సిస్టమ్, BODMAS, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోరేషన్, పర్సెంటేజెస్, మెన్స్యూరేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్‌జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యూలేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ ప్రాబ్లమ్‌లు ఉంటాయి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - అనాలజీస్, ఆల్ఫబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిల్లాగిసమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రాం, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ సఫీషియెన్సీ, కన్‌క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్, ఆర్గుమెంట్స్ అండ్ అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి.
కరెంట్ అఫైర్స్ - ప్రస్తుతం జరుగుతున్న అన్ని అంశాలపై అవగాహన ఉండాలి. స్పోర్ట్ వేదికలు, అవార్డులు, పలు ప్రముఖ సంస్థల అధినేతలు, ఇటీవల అవార్డులు పొందిన వారి వివరాలు వచ్చి ఉండాలి.
జనరల్ అవేర్‌నెస్ - పదో తరగతి వరుకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు ప్రస్తుతం స్పోర్ట్స్, వివిధ రంగాల్లో దేశాభివృద్ధి, ఎకనమిక్స్, పాలిటిక్స్ అంశాలు చదవాలి.
- వేగం, కచ్చితత్వం రెండూ అవసరం. ప్రాక్టీస్ చేసే ముందు నిర్థిష్టసమయంలోనే ప్రశ్నలు చేసేలా కృషి చేయండి. దాని వల్ల పరీక్షలో మెరుగైన మార్కులు సాధిస్తారు.
- ఐదు టాపిక్స్‌కి రోజుకు రెండు లేదా నాలుగు గంటలు కేటాయిస్తే సులభంగా 70 మార్కుల వరుకు స్కోర్ చేయవచ్చు.
- ఈ సారి కట్ ఆఫ్ 75 నుంచి 80 మధ్యలో ఉంటుందని కోచింగ్ సెంటర్లు చెబుతున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.