మీరు టెన్త్ పాసయ్యారా? ఇంటర్ పూర్తి చేశారా? డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందా? టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ లాంటి అర్హతలతో అనేక ఉద్యోగావకాశాలున్నాయి. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించిన తర్వాత వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. పలు నోటిఫికేషన్లలో మొత్తం 4213 పోస్టులన్నాయి. ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయడానికి మరో చివరి తేదీ దగ్గరకొచ్చింది. ఈసీఐఎల్, ఎయిమ్స్, రైల్వే, సీఆర్పీఎఫ్ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలోని బీబీనగర్‌లో గల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ.
Full Story
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 18 పోస్టులున్నాయి. అప్లై చేయడానికి ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.iirs.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
Full Story
భారత పశుసంవర్ధక కార్పొరేషన్ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్-BPNL 3348 పోస్టుల్ని ప్రకటించింది. సేల్స్ అసిస్టెంట్, సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, సేల్స్ మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ.
Full Story
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL 33 హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఒక ఏడాది కాలవ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు ఇవి. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ.
Full Story
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR జోధ్‌పూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్-NIIRNCD కోసం 15 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ 2020 ఆగస్ట్ 30, 31 తేదీల్లో ఉంటుంది.
Full Story
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-CRPF కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, ఎస్ఐ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 789 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ.
Full Story