రైల్‌టెల్ ఇండియా లిమిటెడ్(Railtel India Limited) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎల్-1 ఇంజినీర్ (L1 Engineer) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటన చెన్నై(Chennai), ముంబయిలోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య - 10
సంబంధిత స్పెషలైజేషన్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి..
ఎల్-1 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 24 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. రూ.3,86,077 చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు చెన్నై, ముంబయిలో పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు..
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ, బీటెక్(సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ, ఎంసీఏ, ఎంఎస్సీ(సీఎస్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా.. సంబంధిత పనిలో 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ప్రారంభంకాగా.. ఏప్రిల్ 04 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఏంపిక ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో విద్యార్హత సర్టిఫికేట్లను జత చేసి..జనరల్ మేనేజర్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 4వ అంతస్తు, E.V.R. పెరియార్ హై రోడ్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కార్యాలయం, దక్షిణ రైల్వే, ఎగ్మోర్, చెన్నై, తమిళనాడు – 600008 అడ్రస్ కు ఏప్రిల్ 04లోపు పంపించాలి.
ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ www.railtelindia.com సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, JOBS, Rail