RITES Recruitment 2019: రైల్వే సంస్థలో 93 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

RITES Limited Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవాలి.

news18-telugu
Updated: October 7, 2019, 10:52 AM IST
RITES Recruitment 2019: రైల్వే సంస్థలో 93 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
RITES Recruitment 2019: రైల్వే సంస్థలో 93 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు (image: RITES Ltd)
news18-telugu
Updated: October 7, 2019, 10:52 AM IST
భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్-RITES లిమిటెడ్ జూనియర్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్, సైట్ ఇన్‌స్పెక్టర్ లాంటి పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 93 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు http://www.rites.com వెబ్‌సైట్‌లో Career సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది రైట్స్ లిమిటెడ్. వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవాలి.

RITES Limited Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 93

జూనియర్ ఇంజనీర్ (ఫైనాన్స్)- 22
జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్)- 24
సైట్ ఇన్‌స్పెక్టర్ (సివిల్)- 25


సైట్ ఇన్‌స్పెక్టర్ (E and M)- 7
Loading...
సీఏడీ ఆపరేటర్- 15

RITES Limited Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 10
డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి చివరితేదీ: 2019 అక్టోబర్ 21
విద్యార్హత: డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, పీజీ పూర్తి చేసినవాళ్లు అర్హులు.
వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు.
వేతనం: రూ.18,000 నుంచి రూ.40,000

సైట్ ఇన్‌స్పెక్టర్, సీఏడీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రైట్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జూనియర్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

IGNOU Jobs: ఇగ్నోలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు... వివరాలివే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... రూ.54,000 వరకు వేతనం

SSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...