అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల ఫీజు ఎత్తివేస్తాం -రాహుల్‌గాంధీ

రాహుల్ గాంధీ (File)

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు సరికొత్త ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే కేంద్రప్రభుత్వ పరీక్షల అప్లికేషన్ ఫీజు లేకుండా చేస్తామన్నారు.

  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్నవేళ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేపట్టారు నేతలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ యువతను అట్రాక్ట్ చేసే విధంగా యోచనలు చేసింది. ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పరీక్షల దరఖాస్తు రుసుము లేకుండా చేస్తామని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. సోషల్ మీడియా ఫేస్‌బుక్ వేదికగా ‘కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పెట్టే పరీక్షల దరఖాస్తు రుసుం ఎత్తివేస్తాం’ పోస్టు పెట్టారు.
తాజాగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదలచేసిన కాంగ్రెస్ అందులోనూ నిరుద్యోగులు, పేదలను ఆకర్షించే ఎన్నో పథకాలను రూపొంచింది. ఖాళీగా ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేయడంతో పాటు.. ఉపాధి హామీ పనిదినాలు 150 రోజులకు పెంచుతామని హామి ఇచ్చింది. ఈ విధంగా సరికొత్త ప్రణాళికలతో ఓటర్లను ముఖ్యంగా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్.
First published: