హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Schools Reopening: మన విద్యార్థులు వెనకబడిపోయారు.. ఇక ఆలస్యం చేయకండి.. ప్రభుత్వాలకు మాజీ గవర్నర్​ సూచన

Schools Reopening: మన విద్యార్థులు వెనకబడిపోయారు.. ఇక ఆలస్యం చేయకండి.. ప్రభుత్వాలకు మాజీ గవర్నర్​ సూచన

రఘురాం రాజన్​

రఘురాం రాజన్​

పేద విద్యార్థులు(poor students) చదువులకు దూరమవుతున్నారని(far away) విద్యావంతులు ఆందోళన చెందుతున్నారు. పేద విద్యార్థులపై అధిక శ్రద్ధ (care) తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలో విద్యార్థుల పరిస్థితిపై ఆర్బీఐ(RBI) మాజీ గవర్నర్​ రఘురాం రాజన్(Raghuram rajan)​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

కరోనా(corona) మహమ్మారి కారణంగా విద్యార్థులు(students) చదువులకు దూరమైన సంగతి తెలిసిందే. మొదటి, రెండో వేవ్​లతో ఆయా రాష్ట్రాలు(states) అల్లకల్లోలమయ్యాయి. ఏదో విధంగా ఆన్​లైన్​ క్లాసుల(online classes)తో చదువులు(studies) నెట్టుకొస్తున్నారు. కానీ, అవి ఎంత వరకు అర్థం అవుతున్నాయంటే.. చెప్పడం కష్టం. రెండో వేవ్​ కరోనా తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్(schools), కాలేజీలు ఎప్పుడు తెరవనున్నారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందని పూర్తిగా భావిస్తే తప్ప అనేక రాష్ట్రాల్లో(states) స్కూళ్లు, కాలేజీలను పున: ప్రారంభించే(Reopening) అవకాశం లేదు. కాగా, ఇప్పటికే పేద విద్యార్థులు(poor students) చదువులకు దూరమవుతున్నారని(far away) విద్యావంతులు ఆందోళన చెందుతున్నారు. పేద విద్యార్థులపై అధిక శ్రద్ధ (care) తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశంలో విద్యార్థుల పరిస్థితిపై ఆర్బీఐ(RBI) మాజీ గవర్నర్​ రఘురాం రాజన్(Raghuram rajan)​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల విద్యాశాఖాధికారులకు, మంత్రులకు సూచనలు లాంటి మాటలు చెప్పారు. అవేంటంటే..

భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్(governor) రఘురాం రాజన్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. పాఠశాలలను పున: ప్రారంభించడం(re opening)లో ఆలస్యం(late) చేయకూడదని సూచించారు. విద్యార్థులకు చదువును వేగవంతం చేయడంలో ఆలస్యం చేస్తే రాబోయే దశబ్ధాల పాటు వెంటాడుతుందని హెచ్చరించారు. ’’ఒకటిన్నర సంవత్సరాలుగా విద్యార్థులు నేర్చుకున్న పాఠాలు పరిశీలించండి, పాఠాలు చాలా మంది మర్చిపోతున్నారు” అన్నారు.  ‘‘ఈ పిల్లలను తిరిగి పాఠశాలకు, ముఖ్యంగా పేద వర్గాలకు ఎలా తిరిగి తీసుకురావాలనే దాని గురించి రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాయని నేను నిజంగా ఆశిస్తున్నాను. లేకుంటే మనం ఓ తరం(generation) పిల్లలను కోల్పోతాం(lost)” అని రాజన్​ అన్నారు.

‘‘పేద పిల్లలకు ఆన్‌లైన్(online) చదువుల కోసం అవసరమైన సదుపాయాలు అందుబాటులో లేవు. వారు అదృష్టవంతులైతే ఫోన్ అందుబాటులో ఉండొచ్చు, వారు చదివిన పాఠశాలల నాణ్యత సరిగా లేకపోతే పరిస్థితేంటి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే విద్యార్థులు మూడు, నాలుగు సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు. వారిని తిరిగి గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఒకవేళ అలా జరగకపోతేవాళ్లు మరింత వెనుకబడిపోతారు. గుర్తుంచుకోండి. ఈ పిల్లలంతా మనతో పాటే ఓ 60 ఏళ్లు కలిసి జీవిస్తారు. మనం ఆ తరాన్ని నిర్లక్ష్యం చేయరాదు.”అని రాజన్​ అన్నారు.

First published:

Tags: Central Government, India states, Online classes, Raghuram rajan, Rbi governor, Schools reopening, Students, Telangana Government

ఉత్తమ కథలు