Home /News /jobs /

QUOTA NOT AGAINST MERIT SUPREME COURT IN ORDER ON NEET RESERVATION HERE DETAILS NS

NEET PG, UG Reservations: నీట్ పీజీ, యూజీ రిజర్వేషన్లపై సుప్రీం కీలక వాఖ్యలు.. కౌన్సెలింగ్ కు గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

నీట్(NEET) సీట్ల కేటాయింపు విషయంలో ఆల్ ఇండియా కోటా సీట్లలో ఓబీసీలకు 27 శాతం, EWSకు 10 శాతం కోటా కల్పంచడాన్ని సమర్థించింది. ఇది రాజ్యంగ బద్ధమేనని సుప్రీం స్పష్టం చేసింది.

    నీట్ పీజీ, యూజీ (NEET PG, UG) సీట్లకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్ ఇండియా కోటా సీట్లలో ఓబీసీలకు 27 శాతం, EWSకు 10 శాతం కోటా కల్పంచడాన్ని సమర్థించింది. ఇది రాజ్యంగ బద్ధమేనని సుప్రీం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, బోపన్నల ధర్మాసనం గురువారం కీలక వాఖ్యులు చేసింది. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే నీట్ పీజీ అడ్మిషన్లు నిర్వహించేందుకు సుప్రీం అంగీకరించింది. ఇలాంటి సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించేముందు ఇక మీదట సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పోటీ పరీక్షల్లో వెనుకబడిన తరగతులు అవకాశాలు పొందేందుకు రిజర్వేషన్లు వీలు కల్పిస్తాయని న్యాయస్థానం పేర్కొంది. అవకాశాలకు దూరమైన వారికి సమాన అవకాశాలు కల్పించడానికి రిజర్వేషన్లే మార్గమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన వర్గాలకు వారి కుటుంబ నేపథ్యం కలిసి వస్తుందని, అలాంటి అవకాశం లేని వర్గాల వారికి రిజర్వేషన్లు అండగా ఉంటాయని సుప్రీం వాఖ్యానించింది.
    IGNOU: ఇగ్నో నుంచి మరో కొత్త కోర్సు ప్రారంభం.. అర్హత, ఫీజు వివరాలివే..

    ప్రతిభ అనేది ఒకరి స్వయం కృషి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలని తెలిపింది సుప్రీంకోర్టు. వ్యక్తి ప్రతిభకు అతని చుట్టూ ఉన్న వాతావరణం కూడా దోహదపడుతుందని తెలిపింది. వ్యక్తి ప్రతిభకు అన్ని సమయాల్లో కేవలం మార్కులు మాత్రమే ప్రామాణికం కాదని ధర్మాసనం వాఖ్యానించింది. EWS కోటాకు ప్రాతిపాదికను నిర్ణయించడానికి రూపొందించిన ప్రాతిపాదక వ్యాలిడిటీని మార్చిలో పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS)కు చెందినవారికి NEET-PG ప్రవేశాల విధానాన్ని ఆపడానికి ఉత్తర్వులు ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీం స్పష్టం చేసింది.
    AYUSH NEET: MBBS సీటు మిస్సయిందా..? అంతకు మించిన కోర్సులను అందిస్తున్న ఆయుష్ నీట్.. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇదే..

    ప్రస్తుతం అమలులో ఉన్న విధానమైన రూ.8 లక్షల వార్షికాదాయం ప్రస్తుత విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని సుప్రీం తెలిపింది. ప్రస్తుతం ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అడ్మిషన్లు ఆలస్యమవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2021-22 బ్యాచ్‌కి రిజర్వేషన్ల విధానం ఆపడానికి ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించంది. వైద్యుల నియామకం విషయంలో ఆలస్యం జరిగితే.. దాని ప్రభావం కరోనా విజృంభణపై పడుతుందని వెల్లడించింది.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, NEET, Reservations, Supreme Court

    తదుపరి వార్తలు