హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Qatar Airways Recruitment 2022: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత.. 

Qatar Airways Recruitment 2022: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత.. 

Qatar Airways Recruitment 2022: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత.. 

Qatar Airways Recruitment 2022: ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు.. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత.. 

Qatar Airways Recruitment 2022: ఖతార్ ఎయిర్‌వేస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. భారతదేశం అంతటా వివిధ పోస్టుల కోసం గణనీయమైన సంఖ్యలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఖతార్ ఎయిర్‌వేస్(Qatar Airways) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) వెల్లడించింది. భారతదేశం అంతటా వివిధ పోస్టుల కోసం గణనీయమైన సంఖ్యలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఎయిర్‌లైన్(Airline) తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.  భారతీయ పౌరులు కేటగిరీల్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను పంపవచ్చు. ఖాళీలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు సమర్పణ గడువుతో పాటు నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Government Job Notifications: ఇంటర్, డిగ్రీ/బీటెక్ అర్హతతో 4 నోటిఫికేషన్లు విడుదల.. వివరాలు తెలుసుకోండి..

ఖతార్ ఎయిర్‌వేస్, ఖతార్ డ్యూటీ ఫ్రీ, ఖతార్ ఏవియేషన్ సర్వీసెస్, ఖతార్ ఎయిర్‌వేస్ క్యాటరింగ్ కంపెనీ, ఖతార్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి ధియాఫాటినా హోటల్స్ వరకు వివిధ విభాగాలకు సిబ్బందిని నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కార్పొరేట్ అండ్ వాణిజ్య, నిర్వహణ, కార్గో, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్, విమాన కార్యకలాపాలు, గ్రౌండ్ సర్వీసెస్, భద్రత , డిజిటల్ అండ్ ఫైనాన్స్ వంటి వాటిలో కూడా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య పేర్కొనలేదు. కానీ గణనీయమైన సంఖ్యలో సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది.

ఈ రిక్రూట్ మెంట్ అనేది ఇండియాలో సెప్టెంబర్ 16, 17 తేదీలలో ఢిల్లీలో జరుగుతుంది. సెప్టెంబర్ 29, 30 తేదీలలో ముంబైలో జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఖతార్ ఎయిర్‌వేస్ కెరీర్ పేజీ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. దీనికి డైరెక్ట్ లింక్ ఇదే https://qatarairways.com/recruitment. దీనిపై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తులను పంపించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వసతి మరియు అలవెన్సులతో సహా మంచి ఆదాయాన్ని పొందుతారని ఎయిర్‌లైన్ తెలియజేసింది.

కంపెనీ పేరు: ఖతార్ ఎయిర్‌వేస్

పే స్కేల్: పోస్ట్ ప్రకారం ఉంటుంది

 ముఖ్యమైన తేదీలు

1) ఢిల్లీలో 2022 సెప్టెంబర్ 16 , 17 తేదీల్లో..

2) ముంబైలో 2022 సెప్టెంబర్ 29 , 30 తేదీల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

పోస్ట్ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి..?

ఆసక్తి గల దరఖాస్తుదారులు ఖతార్ ఎయిర్‌వేస్ కెరీర్ పేజీ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Fake Universities: నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు.. వివరాలిలా..

అర్హతలు.. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. కొన్ని పోస్టులకు ఈ అర్హతతో పాటు.. పని అనుభవం, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్బర్ అల్ బేకర్ మాట్లాడుతూ.. "మేము మా బృందాన్ని బలోపేతం చేయడానికి , ప్రయాణికుల కోసం కస్టమర్ అనుభవాన్ని మరింత దగ్గర చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.  అదే సమయంలో తాము సిబ్బందిని నియమించుకునే పనిలో ఉన్నాము.. దీని ద్వారా మా కార్యాచరణ సామర్థ్యాలను పెంచుతామన్నాడు. ఖతార్ ఎయిర్‌వేస్ ఎల్లప్పుడూ భారతదేశంతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో, తాము మార్కెట్ పట్ల మా నిబద్ధతను మరింత పటిష్టం చేస్తున్నాము. ఇదే సంబంధాన్ని ఉన్నతంగా ఉంచుతూ.. ప్రతిభావంతులైన భారతీయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని బేకర్ పేర్కొన్నాడు.

First published:

Tags: Airport, Career and Courses, JOBS, Qatar

ఉత్తమ కథలు