PWC IS HIRING FOR VARIOUS ROLES IN INDIA WFH AND FRESHERS CAN ALSO APPLY GH PVN
New Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రొషెషనల్ సర్వీసులను అందించే కంపెనీలో ఉద్యోగాలు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రొఫెషనల్ సర్వీసులను అందించే ప్రముఖ సంస్థల్లో ఒకటైన PwC.. వివిధ హోదాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫ్రెషర్లు, ఎక్స్పీరియన్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు..
PwC Hiring For Various Roles : ప్రొఫెషనల్ సర్వీసులను అందించే ప్రముఖ సంస్థల్లో ఒకటైన PwC.. వివిధ హోదాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఫ్రెషర్లు, ఎక్స్పీరియన్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి కేరీర్ పేజీలో PwC ఇలా స్పందించింది. ‘‘సవాళ్లను మీతో కలిసి చక్కగా పరిష్కరించుకుంటాం. దాన్ని మేం బలంగా నమ్ముతున్నాం. విలువలతో ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి, విభిన్నంగా పరిష్కరించే గ్లోబల్ కమ్యూనిటీని సృష్టించాం. దీంతో మా సమ్మిళిత సంఘం పెరుగుతూనే ఉంది.’’ అని పేర్కొంది. కెరీర్ గ్రోత్‌కు అవకాశాల కోసం PwC అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. సరికొత్త సాంకేతిక సాధనాలను ఉపయోగించి విభిన్న రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చని ఫ్రెషర్స్‌ను ఉద్దేశించి PwC వ్యాఖ్యానించింది.
ఎక్స్పీరియన్స్ అభ్యర్థులను ఉద్దేశించి ఇలా స్పందించింది. “మీ అనుభవాలను తీసుకురండి. మీ నైపుణ్యాలను పెంచుకోండి. అందులో మీ మార్క్ చూపించండి. PwC టీమ్ మీ నైపుణ్యాన్ని కొత్తగా, ఊహించని మార్గాల్లో వర్తింపజేయడానికి సిద్ధంగా ఉంది. సౌకర్యవంతమైన సాంకేతికతతో పనిచేయడం వల్ల మీ కెరీర్ సాధికారత పొందనుంది.’’ అని PwC పేర్కొంది.
PwC కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 1000 రిమోట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ www.pwc.com ను సందర్శించాలని తెలిపింది.
* న్యూ ఈక్వేషన్
కంపెనీ రిఫ్రెష్డ్ స్ట్రాటజీని తాజాగా న్యూ ఈక్వేషన్‌గా పిలుస్తున్నారు. దీని గురించి కంపెనీ వ్యాఖ్యానిస్తూ... ‘‘PwC నెట్వర్క్ కోసం అత్యంత విశ్వసనీయమైన వృత్తిపరమైన సేవల వ్యాపారంలో అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు వినూత్న సాంకేతికతను మిళితం చేయనున్నాం. సంస్థలకు తమపై నమ్మకాన్ని పెంపొందించడానికి, స్థిరమైన ఫలితాలను అందించడంలో ఇది సహాయపడుతుంది.’’ అని పేర్కొంది.
ప్రస్తుతం PwC 156 దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. దాదాపు 3,00,000 మంది నిపుణులు పనిచేస్తున్నారు. న్యూ ఈక్వేషన్ ప్రకారం 2026 నాటికి 1,00,000 మంది కొత్త నిపుణులను నియమించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు PwC వెల్లడించింది.
మరోవైపు, దేశీయ దిగ్గజ ఐటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా నియామకాలను చేపట్టనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2021లో నియామకాల విషయాల్లో దాదాపు 61వేల ఉద్యోగులను క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియాకాలను ఈ రెండు కంపెనీలు భారీగా చేపట్టనున్నాయి. టీసీఎస్ 1,00,000, ఇన్ఫోసిస్ 85వేల మంది ప్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023)లో మరో 50వేల మంది ప్రెషర్లకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ మాట్లాడుతూ.. గత సంవత్సరం భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నామని... ఈసారి కూడా కనీసం 50,000 నియామకాలు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
టీసీఎస్ కూడా ఇన్ఫోసిస్ దారిలోనే నడిచే అవకాశం ఉంది. గతేడాది చేపట్టిన విధంగానే ఈసారి కూడా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 40,000 నియామకాల లక్ష్యంతో కంపెనీ ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తోందని.. అవసరమైతే ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జి సుబ్రమణ్యం తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.