హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక..

Telangana Jobs: పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక..

Telangana Jobs: పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక..

Telangana Jobs: పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక..

హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

హైదరాబాద్‌లోని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో(University) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. దీనిలో భాగంగా.. ప్లాంట్‌ ప్రొటెక్షన్‌, ఫిషరీస్‌, వెటర్నరీ, వెటర్నరీ మెడిసిన్(Medicine) విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ విభాగాల్లో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ (SMS) పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

మొత్తం ఖాళీల సంఖ్య 4 .. 

సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ విభాగంలో 4 పోస్టులను భర్తీ చేస్తారు. 5 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన వెటర్నరీ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వెటర్నరీ మాస్టర్ డిగ్రీ LPM/ AGB / ANN / పౌల్ట్రీ సైన్స్ వంటి వాటిలో పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు..యూజీసీ సీఎస్ఐఆర్‌ నెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు భాషలో మాట్లాడటం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి. పై పోస్టులు పూర్తిగా తాత్కాలికంగా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56100 చెల్లిస్తారు.

Indian Railway jobs: రైల్వేలో ఉద్యోగాలు .. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను http://www.tsvu.edu.inand/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. పూర్తి వివరాలను నమోదు చేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500 062 అడ్రస్ కు అక్టోబర్ 10, 2022న నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ప్రయాణ ఖర్చులు, టీఏ(TA), డీఏ(DA)లాంటివి చెల్లించరని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మొత్తం 100 మార్కులకు ఈ ఎంపిక విధానం ఉంటుంది. 80 మార్కులు అభ్యర్థి యొక్క అర్హత సర్టిపికెట్ల ఆధారంగా కేటాయిస్తారు. మిగిలిన 20 ఇంటర్వ్యూకు కేటాయించారు.

TSPSC New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడో, రేపో 738 పోస్టులకు నోటిఫికేషన్..

డిగ్రీకి వెయిటేజీ 15 మార్కులు ఇలా..

సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ పూర్తి చేసిన వారికి 80 శాతం కంటే ఎక్కువ మార్కలు సాధిస్తే..15 మార్కులు, 60 నుంచి 80 శాతం వచ్చిన వారికి 13 మార్కులు, 55 శాతం నుంచి 60 శాతం సాధించిన అభ్యర్థులకు 10 మార్కులు, 45 శాతం కంటే తక్కువ వచ్చిన వారికి 05 మార్కులు కేటాయిస్తారు.

పీజీకి వెయిటేజీ 25 మార్కులు..

80 శాతం కంటే ఎక్కువ 25 మార్కులు, 60 నుంచి 80 శాతం వచ్చినవారికి 23 మార్కులు, 55 శాతం కంటే తక్కువ ఉంటే..20 మార్కులు కేటాయిస్తారు.

వీటితో పాటు.. MPhil ఉన్న వారికి 07 మార్కులు కేటాయిస్తారు.

పీహెచ్డీ అభ్యర్థులకు 30 మార్కులు, జేఆర్ఎఫ్ తో నెట్ ఉన్నవారికి 07 మార్కులు, కేవలం నెట్ ఉన్న వారికి 05 మార్కులు, స్లెట్ లేదా సెట్ ఉన్న వారికి 03మార్కులు కేటాయిస్తారు.

TCS Jobs 2022: ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన TCS.. ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

రీసెర్చ్ పబ్లికేషన్ కు గరిష్టంగా 10 మార్కులు, టీచింగ్ అనుభవం ఉన్న వారికి 10 మార్కులను కటాయిస్తారు.

అవార్డ్స్, ఇతర అదనపు అర్హతలు ఉంటే మరో 5 మార్కులను కేటాయిస్తారు.

ఇలా మొత్తం అకడమిక్ అర్హత కింద 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించి.. మెరిట్ ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ.. 10-10-2022న ఉదయం 11 గంటలకు యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో నిర్వహించబడతాయి. పూర్తి వివరాలకు http://www.tsvu.edu.inand/ వెబ్ సైట్లో చూడొచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Telangana government jobs, Telangana jobs

ఉత్తమ కథలు